మంత్రి వెల్లంపల్లికి జనసేన సవాల్..దుర్గమ్మ పై ప్రమాణం చేయాల్సిందే !

విజయవాడ : దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి మరో స్కామ్ కి తెరలేపాడని… తాడేపల్లి లో క్యాపిటల్ బిసినెస్ పార్క్ కి జీఓ 61 ద్వారా లబ్ది చేకూర్చారని ఆరోపించారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ఇందులో ఉన్న నలుగురు పార్టనర్లు వెల్లంపల్లి పక్కనే ఉండేవారని…. వెల్లంపల్లి మిత్ర బృందానికి 30 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చారన్నారు…

వెల్లంపల్లి బినామీ వ్యవస్థకు జీఓ తెచ్చి స్కామ్ చేస్తుంటే జనసేన చూస్తూ ఊరుకోదని… సీఎం దృష్టిలో లేకుండా మేకపాటి గౌతమ్ రెడ్డి జీవో తెచ్చారని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ లో లేని ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ కి కోసం జీ. ఓ తెచ్చారని… మంత్రులు ఇద్దరు కమీషన్ పంచుకుంటున్నారని మండిపడ్డారు…ఆధారాలు మాదగ్గర ఉన్నాయి. సమాధానం చెప్పాలి? అని డిమాండ్‌ చేశారు. క్యాపిటల్ బిసినెస్ పార్క్ కి తరలించారని వెల్లంపల్లి చూస్తున్నాడని…పేర్కొన్నాడు. మంత్రి వెల్లంపల్లి కి జి.ఓ తో లబ్ది పొందిన సంస్థకు అందులోని వ్యక్తులకు సంబంధం లేదని దుర్గమ్మ పై ప్రమాణం చెయ్యాలని పోతిన మహేష్ బహిరంగ సవాల్ విసిరారు. తప్పు చెయ్యకుంటే ధైర్యంగా మంత్రి శుక్రవారం దుర్గమ్మ కొండకి రావాలని తెలిపారు.