స్టేట్ బ్యాంక్ కొత్త పాలసీ.. లాభాలు ఇవే…!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే పాలసీలని తీసుకు వచ్చింది. దీని వలన ఎన్నో బెనిఫిట్స్ వున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు SBIకు చెందిన జాయింట్ వెంచర్ ఎస్‌బీఐ లైఫ్ కొత్త పాలసీ తీసుకు వచ్చింది. అదే లైఫ్ పూర్ణ సురక్ష. అయితే దీని వలన కలిగే లాభాలు ఏమిటి అనేది చూద్దాం…!

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్.ఒకవేళ ఈ పాలసీని కనుక తీసుకుంటే పాలసీ గడువులో మరణిస్తే అప్పుడు పాలసీ బెనిఫిట్స్ కుటుంబ సభ్యులకు లేదంటే నామినీకి వస్తాయి. ఇది ఇలా ఉంటే ఈ పాలసీ కవరేజ్ దాదాపు 36 ప్రాణాంతక వ్యాధులకు కూడా వర్తిస్తుంది గమనించండి.

అలానే ప్రీమియం రిబేట్ బెనిఫిట్స్ కూడా మీకు దీని ద్వారా లభిస్తుంది. పాలసీ టర్మ్ 10 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. వయస్సు విషయానికి వస్తే..18 ఏళ్లు దాటిన వారు ఎవరైనా సరే ఈ పాలసీ తీసుకోవచ్చు.

65 ఏళ్లలోపు వారికే ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని నెల, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించచ్చు. 30 ఏళ్ల వ్యక్తి 10 ఏళ్ల కాల పరిమితితో ఈ పాలసీ తీసుకుంటే పాలసీ మొత్తం రూ.2.5 కోట్లు. ఇప్పుడు వార్షిక ప్రీమియం రూ.35,849 అవుతుంది. దీని ప్రకారం రోజుకు దాదాపు రూ.100 ఆదా చేస్తే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news