లేటెస్ట్ స్కామ్ అలర్ట్.. ఆధార్‌ కార్డుతో కూడా డబ్బులు మాయం…!

-

ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో ఆధార్ కార్డు చాలా అవసరం. భారతదేశంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. స్కామర్లు ఎప్పటికప్పుడు ప్రజల్ని మోసం చేయడానికి డబ్బులు కాజేస్తున్నారు. కొత్త మార్గాలని కూడా కనుగొంటున్నారు. కొత్తగా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ని మోసాలకు ఆయుధంగా వాడుతున్నారు. ప్రజలకు బ్యాంకింగ్ ని ఈజీ చేయడానికి ప్రభుత్వం రూపొందించిన ఈ సర్వీస్ ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏఈపీఎస్ ద్వారా జరుగుతున్న సైబర్ మోసాల గురించి ఇప్పటికే రాష్ట్రాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఆధార్ కార్డు వేలిముద్ర వంటి బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు దోచేస్తున్నారు.

అకౌంట్ ఆధార్ తో లింక్ అయ్యి ఏఈపిఎస్ సర్వీస్ ఎనేబుల్ అయ్యి ఉంటే మీరు చెక్ బుక్ లేదా ఏటీఎం లేకుండా అకౌంట్ నుంచే డబ్బులు తీసుకోవచ్చు. ఏఈపీఎస్ ద్వారా ఎలా మోసం చేస్తున్నారు..?, ఎలా రక్షించుకోవాలి అనేది చూస్తే.. స్కాన్ చేయడానికి స్కామర్లు ముందు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రజల బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ని దొంగలిస్తున్నారు. ల్యాండ్ డాక్యుమెంట్లు వంటివి వ్యక్తుల బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటాయి.

బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం డాక్యుమెంట్స్ నుంచి వేలిముద్రలని దొంగలిస్తారు స్కామర్ల చేతిలోకి ఈ సమాచారం వెళ్లిందంటే అకౌంట్ నుంచి డబ్బులు పోయినట్లే. ఇలాంటి స్కామ్స్ నుంచి రక్షించడానికి ఆధార్ సురక్షితంగా ఉంచుకోవాలి. మాస్క్డ్ ఆధార్ కార్డు తీసుకోవాలి. ఈ ఆధార్ కార్డులో పూర్తి ఆధార్ కార్డు నెంబర్ కనపడదు. ఆధార్ నెంబర్ కి బదులుగా వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు షేర్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version