కరోనా వైరస్ తగ్గే దాకా ఈ ప్రదేశాలకి వెళ్ళద్దు…!

-

కరోనా వైరస్ సెకండ్ వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజుకి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే ప్రజలు ఈ ప్రదేశాలకి వెళ్లకుండా ఉండటమే మంచిది. కరోనా మీకు సోకకుండా ఉండాలి అంటే ఈ ప్రదేశాలకు వెళ్ళకండి.

 

సూపర్ మార్కెట్:

మీరు ఒకవేళ సరుకులు తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్ కి వెళ్తుంటే దానిని ఎవాయిడ్ చేయడం మంచిది. వీలైనంత వరకు ఆన్లైన్లో గ్రోసరీ షాపింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువ సేపు క్యూలో నిలబడడం, జనం మధ్యలో నిలబడడం లాంటివి చేయక్కర్లేదు.

మార్కెట్ మరియు మాల్స్:

మార్కెట్ కి మాల్ కి వెళ్లడం మానేయడం మంచిది. మాల్ కి వెళ్లడం వల్ల వందలో జనం ఉంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.

హిల్ స్టేషన్స్:

వేసవి కాలం వచ్చేసింది వేసవిలో వీకెండ్ వచ్చిందంటే చాలు అందరికీ హిల్ స్టేషన్స్ కి వెళ్లిపోవడం అలవాటు. అలానే చాలామంది కుటుంబంతో టూరిస్ట్ ప్రదేశాలకి వెళుతుంటారు మీరు కూడా వెళ్దామని అనుకుంటే ఆ ప్లాన్ ని ఆపడం మంచిది. వీలైనంత వరకు ఇంట్లోనే కూర్చోవడం మేలు.

పార్క్ లేదా ప్లేగ్రౌండ్ :

పిల్లల్ని పార్కుల్లో కూర్చోబెట్టడం కంటే ఇంట్లో ఆడించటం లేదా మొబైల్, ల్యాప్టాప్ వంటివి ఇవ్వడం మంచిది. పార్క్ లేదా మైదానాలలోకి పంపించొద్దు. అక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

ఫిట్నెస్ సెంటర్:

మీరు ప్రతి రోజూ జిమ్ కి వెళ్తున్నారా..? అయితే కొన్ని రోజుల వరకు వెళ్ళకండి. ఎందుకు అంటే ఫిట్నెస్ సెంటర్ ద్వారా కూడా కరోనా వస్తుంది దానికి బదులుగా మీరు ఇంట్లో కూర్చుని వ్యాయామం చేయడం మంచిది.

పార్టీలకు వెళ్లడం:

కరోనా తగ్గుముఖం పట్టే వరకు పార్టీలని ఎవాయిడ్ చేయడం మంచిది. ప్రతి రోజూ చాలా మంది పార్టీలుకి వెళుతూ ఉంటారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా వీటి కారణంగా ఎక్కువ మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలి అంటే ఈ ప్రదేశాలకు దూరంగా ఉండటం మేలు.

Read more RELATED
Recommended to you

Latest news