బ్రేకింగ్: జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా…!

-

జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిలిపివేశారు. మళ్ళీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది అనేది పరీక్ష తేదికి పదిహేను రోజులు ముందు ప్రకటిస్తారు. మామూలుగా అయితే ఏప్రిల్ 27, 28, 29 మరియు 30 వ తేదీన జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ కవర్ణ తీవ్రత ఎక్కువగా ఉండడం తో ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలియజేయడం జరిగింది.

 

విద్యార్థులకు సేఫ్టీ ముఖ్యమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అయితే పరీక్ష ఎప్పుడు నిర్వహించేది అనేది పరీక్ష తేదీకి 15 రోజుల ముందు ప్రకటిస్తామని ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు. ప్రస్తుతం వైరస్ తీవ్రతని చూస్తుంటే పరీక్షలనని వాయిదా వేయడమే మంచిదని తెలియజేశారు అయితే ఈ సమయం లో విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మరియు పరీక్షల సమయానికి ఆరోగ్యంగా ఉండటం మంచిదని అన్నారు.

NTA అభ్యాస్ యాప్ ద్వారా ఇంట్లో ఉండే ప్రాక్టీస్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పరీక్షలని నాలుగు సార్లు కండక్ట్ చేస్తున్నట్లు, ఈ నాలుగు లో వాళ్ళకి నచ్చినప్పుడు పరీక్ష వ్రాసేందుకు ఎటెండ్ అవ్వచ్చు అని తెలిపారు. ఇప్పటి వరకు రెండు సెషన్స్ లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించేవారు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ పరీక్ష లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని ఒక్కో సెక్షన్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ ప్రశ్నలు వుంటాయని…ప్రతి సెక్షన్లో కూడా 30 ప్రశ్నలు ఉంటాయని వాటిలో ఇరవై ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news