వాహన పత్రాలు వెంట తీసుకెళ్లలేదా..? అయితే ఇలా చేయండి..!

-

ప్రస్తుతం మన దేశంలో వాహనదారులకు డిజిలాకర్, ఎం పరివాహన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు అదనంగా ఆర్టీఏ ఎం వ్యాలెట్ యాప్ అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు యాప్‌లూ ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో వాహనదారులకు లభ్యమవుతున్నాయి.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన నూతన మోటార్ వాహన చట్టం వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు, వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ తదితర అవసరం అయ్యే పత్రాలన్నీ ఉన్నా.. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వీపు విమానం మోత మోగేలా ఫైన్లు వేస్తున్నారు. అయితే ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనం నడిపినప్పటికీ.. అవసరం ఉన్న ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి మరిచిపోయినా.. పెద్ద ఎత్తున చలానా కట్టాల్సి వస్తోంది. దీంతో వాహనదారులు ఇండ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు అన్ని పత్రాలు ఉన్నాయా, లేదా అని చూసుకోవాల్సి వస్తోంది. పొరపాటున మరిచిపోతే ఇంక అంతే సంగతులు. అయితే ఆయా పత్రాలను మరిచిపోయినా.. ఏం దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ఈ యాప్‌లు ఫోన్లలో ఉంటే చాలు.. ఆ పత్రాలను మరిచిపోయినా.. యాప్‌లలో ఉండే డిజిటల్ పత్రాలను చూపిస్తే చాలు.. చలానా కట్టాల్సిన పని ఉండదు.

do not have vehicle papers do this

ప్రస్తుతం మన దేశంలో వాహనదారులకు డిజిలాకర్, ఎం పరివాహన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు అదనంగా ఆర్టీఏ ఎం వ్యాలెట్ యాప్ అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు యాప్‌లూ ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో వాహనదారులకు లభ్యమవుతున్నాయి. వీటిల్లో వాహనదారులు తమ వాహన పత్రాలతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలను డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఆయా పత్రాలను తీసుకెళ్లడం మరిచిపోయినప్పటికీ ఆ యాప్‌లను ఓపెన్ చేసి వాటిల్లో డిజిటల్ రూపంలో ఉండే ఆ పత్రాలను చూపిస్తే ట్రాఫిక్ చలానా కట్టాల్సిన పనిఉండదు. ఫైన్ పడదు. ఈ అవకాశాన్ని వాహనదారులు ఉపయోగించుకోవచ్చని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

అయితే డిజిటల్ రూపంలో ఉన్న ధ్రువపత్రాలను చూపిస్తే ఓకే అంటారు కదా అని చెప్పి.. ఫొటో తీసిన లేదా స్కాన్ చేసిన పత్రాలను చూపిస్తే మాత్రం అనుమతించరు. ఎందుకంటే.. ఆయా పత్రాలను ఆయా యాప్‌లలో చూపిస్తేనే చెల్లుబాటు అవుతుంది. అంతేకానీ.. వాటిని ఫొటో తీసి, స్కాన్ చేసి ఫోన్‌లో స్టోర్ చేసుకుని ఆ తరువాత వాటిని ఓపెన్ చేసి చూపిస్తామంటే కుదరదు. ఫైన్ వేస్తారు. కనుక ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకోవాలంటే.. పత్రాలన్నీ తీసుకెళ్లాలి. లేదా పైన చెప్పిన యాప్‌లలో ఆయా పత్రాలను స్టోర్ చేసుకుని వాటినైనా చూపించాలి. దీంతో ఫైన్ పడకుండా తప్పించుకోవచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news