ఈ మధ్య కాలంలో దాదాపు అందరి ఇంటి ముందు మనీ ప్లాంట్ లు ఉంటున్నాయి. అయితే ఈ మొక్కను కొంత మంది ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఈ మనీ ప్లాంట్ ను తప్పకుండా ఆగ్నేయా దిశ లోనే ఉంచాలి. నిజానికి ఆగ్నేయ దిశ కు అధి పతి గా వినాయకుడు ఉంటాడు. అంతే కాకుండా ఆగ్నేయ దిశ లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.
అందుకే అగ్నేయ దిశ లో మనీ ప్లాంట్ ను ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎట్టి పరిస్థితులలో కూడా ఈశాన్యం, ఉత్తరం తో పాటు తూర్పు వంటి దిశ ల వైపు ఉంచ కూడదు. ఈ మూడు దిశ లలో మనీ ప్లాంట్ ను ఉంచితే తీవ్ర నష్టాలు కలుగుతాయి. అలాగే ఈ మనీ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితులో కూడా ఇంటి బయట ఉంచ రాదు. అలాగే ఈ తీగ ను పైకి వెళ్లే విధంగానే ఉంచాలి. ఇలా మనీ ప్లాంట్ ను ఉంచినట్టైతే వారికి శుభపరిణామాలు వస్తాయి.