మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లు లో పాన్ కార్డు ఒకటి. పాన్ కార్డ్ చాలా వాటికి అవసరమవుతుంది. దేశంలోనే పన్ను చెల్లించడానికి పాన్ కార్డు తప్పనిసరి. కనుక పాన్ కార్డు లేనివాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డు తో ఆదాయం ట్రాన్సాక్షన్స్ వంటివి ఆదాయపు పన్ను శాఖ ట్రాక్ చేస్తుంది. అయితే పాన్ కార్డులో 10 అంకెల ఉంటాయన్న సంగతి తెలిసిందే.
దీని మీద కొన్ని అక్షరాలు కొన్ని అంకెలు కూడా ఉంటాయి. అయితే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. పాన్ కార్డులో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ హోల్డర్ అనే దాని కింద ఐదు ఇంగ్లీష్ అక్షరాలు, నాలుగు అంకెలు ఉంటాయి. అలానే ఆ తర్వాత మరో ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది. ఇలా మొత్తం పది అంకెలు లేదా అక్షరాలు ఉంటాయి. అయితే వీటిలో మొదటి మూడు అక్షరాలు ఆల్బాబెటిక్ సీక్వెన్స్. అయితే నాలుగో అక్షరం మాత్రం కార్డు హోల్డర్ టైప్‌కు సంబంధించింది. కార్డు హోల్డర్ టైప్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం.
A- Association of persons (AOP) B- Body of Individuals (BOI) C- Company F- Firm G- Government H- HUF (Hindu Undivided Family) L- Local Authority J- Artificial Juridical Person P- Individual or Person T- Trust (AOP) ఇవి నాలుగో అక్షరం తాలూకా అర్ధాలు.
నాలుగో అక్షరం హెచ్ అయితే ఆ హోల్డర్ టైప్ Hindu Undivided Family అని. ఇక ఐదో దాని గురించి చూస్తే.. ఐదవది సర్ నేమ్ లేదా లాస్ట్ నేమ్ అవ్వచ్చు. పర్సన్ లేదా ట్రస్ట్ లేదా సొసైటీ లేదా ఎంటిటీ లేదా ఆర్గనైజేషన్ పేర్లను సూచిస్తాయి. నెక్స్ట్ నాలుగు నెంబర్లు ఉంటాయి. పదోది అయితే ప్రస్తుత కోడ్ ని సూచిస్తుంది.