రైలులో నుండి ఫోన్ లేదా విలువైన వస్తువులు పడిపోతే ఏం చేయాలో తెలుసా..? ఈ నంబర్లు గుర్తుపెట్టుకోండి..!

-

ట్రైన్ జర్నీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదూ..ఏం చక్కా..ట్రైన్ లో విండో సీట్ లో కుర్చుని మంచి మ్యూజిక్ పెట్టుకుని చుట్టుపక్కల ప్రదేశాలను చూస్తుంటే చాలా పీస్ ఫుల్ గా అనిపిస్తుంది. ఇంకా ట్రైన్ విండో సీట్ లో ఫుటోలు కూడా బాగా తీసుకోవచ్చు. కానీ మనకో, మన స్నేహితులకో ఇలా జరిగే ఉంటుంది. ట్రైన్ లో వెళ్లేప్పుడు కిటికీలోంచో లేదా..గేట్ దగ్గర నుల్చున్నప్పుడో మన ఫోన్ లేదా మరే ఇతర విలువైన వస్తువులు జారీ కిందపడటం జరిగే ఉంటుంది. ఇక అంత స్పీడ్ గా వెళ్లే ట్రైన్ మనం ఆపలేం..ఆ వస్తువుపై ఆశలు వదిలేసుకోవటం తప్ప ఏమీ చేయలేం అనుకుంటాం..కానీ ఓ మార్గం ఉందట..అదేంటంటే..!

రైలులో వెళ్లేప్పుడు మీ వస్తువు ఎక్కడ పడిందో తరువాత వచ్చే స్టేషన్లో కంప్లైట్ ఇచ్చి ఆ ప్రదేశం పేరు చెప్పాలి. ఇది మరీ బాగుంది..అంత స్పీడ్ గా వెళ్లే ట్రైన్ లో అదేం ఊరు, ఆ ప్రదేశం ఏంటి అనేది ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా..ప్రదేశం అంటే అవి కావు.. మన ట్రైన్ ప్రయాణించే ట్రాక్ పక్కన కొన్ని స్తంభాలుంటాయి. ఆ స్తంభాల మీద రెండు నంబర్లు ఉంటాయి. ఆ రెండు నెంబర్లకి మధ్య సింబల్ ఉంటుంది. సింబల్ పైన ఉన్న నంబర్ మీరు ట్రైన్ దిగే ప్రదేశం వరకు ప్రయాణించాల్సిన కిలోమీటర్లని సూచిస్తుంది. సింబల్ కింద ఉన్న నంబర్ ఆ స్తంభం నెంబర్ సూచిస్తుంది.

కాబట్టి మీ వస్తువు పడిపోయిన ప్రదేశం దగ్గరలో ఉన్న స్థంభం నంబర్ గుర్తుపెట్టుకుని తరువాత వచ్చే స్టేషన్లో దిగి గవర్నమెంట్ రైల్వే పోలీస్ వారికి లేదా స్టేషన్ మాష్టర్ కి ఫిర్యాదు చేయవచ్చు. మీ వస్తువు తప్పుకుండా దొరుకుతుంది అని హామీ అయితే ఇవ్వలేం కానీ వారు కంప్లైంట్ ను పరిశీలించి వస్తువు కోసం గాలిస్తారు.ఈ లోపు అక్కడ నడిచి వెళ్లే ఎ‌వరైనా ఆ వస్తువు తీసుకెళ్లకుండా ఉంటే అది దొరకొచ్చు.

ఇదనమాట..ఆ స్థంభాల వెనకు ఉన్న అర్థం. ఈ సారి మీరు ఎప్పుడైన ట్రైన్ జర్నీ చేస్తుంటే ఆ స్థంభాలను గమనించండి. ఒక సిరీస్ లో నంబర్లు వేసి ఉన్నాయా లేదా అని చెక్ చేయండి మంచి టైం పాస్ కూడా అవుతుంది కదా..!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news