గ్యాస్‌ సిలిండర్‌ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా..?

-

డైలీ వంటగదిలో ఎంతో పని చేస్తుంటాం. గ్యాస్‌ సిలిండర్‌ లేనిదో ఒక్కరోజు కూడా పనిచేయలేం కదా..! మీరు రోజు ఎన్నో సార్లు ఈ గ్యాస్‌ సిలిండర్‌ను చూసే ఉంటారు. కానీ ఎప్పుడైనా మీకు ఈ డైట్‌ వచ్చిందా.. ఇది అసలు ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది.? పసుపు, ఆకుపచ్చ, నలుపు ఇలా చాలా రంగులు ఉన్నాయి కదా ఇలా ఎందుకు ఎరుపు రంగునే ఇచ్చారు..? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఓసారి పరిశీలిద్దామా..!

- Advertisement -

ఎరుపు రంగు ప్రమాదానికి సూచిక. ప్రమాదం పొంచి ఉన్న చోట ఎర్రని కండువా లేదా బోర్డును ఉపయోగిస్తుంటారు. ఇది చూసి ఇక్కడ ప్రమాదం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెబుతుంటారు. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ప్రమాదకరమే. ఎందుకంటే అందులో మండే వాయువు ఉంటుంది. కొంచెం అటు ఇటు అయినా ప్రమాదం తప్పదు. అందుకే దీనికి సూచికగా ఎరుపు రంగును వాడుతారు.

ఎరుపు రంగును ఎంత దూరం నుంచైనా చూడొచ్చు. అది కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. అందుకే గ్యాస్ సిలిండర్లకు వాటి యజమానులు ఇలా ఎరుపు రంగును వాడారు. గతంలో ప్రతీ ఇంట్లో కట్టెల పొయ్యి ఉండేది. కానీ ఇప్పుడు సిలిండర్ రాకతో వాటిని అంతగా వాడడం లేదు. కాకపోతే గ్యాస్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. సిలిండర్‌ నుంచి స్టవ్‌ వరకూ ఎలాంటి లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం గ్యాస్‌ లీక్‌ అవుతున్న అనుమానం వచ్చిన తగిన చర్యలు తీసుకోవాలి. చాలాసార్లు.. ఆ గ్యాస్‌ పైప్‌ను స్టవ్‌కు సెట్‌ చేసే దగ్గరే లీక్‌ అవుతుంది. మంటలు కూడా వస్తాయి. కాబట్టి ఆ కనక్షన్‌ దగ్గర టైట్‌గా ఫిట్‌ చేసుకోవాలి.

హెచ్పీ గ్యాస్‌ సిలిండర్లు కొన్ని బ్లూ కలర్‌లో కూడా ఉంటాయి కదా అని మీకు డౌట్‌ రావొచ్చు. వాళ్లు ఈ రూల్‌ను పాటించరా అని.. బ్లూ కలర్‌లో ఉండే గ్యాస్‌ సిలిండర్లను ఇండస్ట్రియర్‌ పర్పస్‌ కోసం వాడతారట. రెండింటి మధ్య తేడా ఉండాలని వాటికి బ్లూ కలర్‌ వేసినట్లు చెప్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...