మీ ఇంట్లో చిన్నపిల్లలకు బ్లూ ఆధార్ కార్డు కావాలా..? అయితే ఇలా చేయండి..!

-

ఆధార్ కార్డు కి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో వాటికి ఆధార్ కార్డు కచ్చితంగా కావాలి. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా లేదంటే పాన్ కార్డు కావాలన్నా ఇలా చాలా వాటికి ఆధార్ ఉండాలి. యూఐడీఏఐ ఇటీవల స్పెషల్‌గా బ్లూ కలర్ ఆధార్ కార్డుల్ని ఇస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలని చూసేద్దాం. ఈ బ్లూ ఆధార్ కార్డు అనేది చిన్న పిల్లల కోసమే. స్పెషల్‌గా బ్లూ ఆధార్ కార్డులు ని వాళ్లకి జారీ చేస్తుంటుంది. బాల్ ఆధార్ అని కూడా అంటుంటారు. ఐదేళ్లలోపు పిల్లల కోసం ఈ ఆధార్ ని ఇస్తూ వుంటారు.

బ్లూ ఆధార్ కార్డు
బ్లూ ఆధార్ కార్డు

 

చిన్న పిల్లల ఫింగర్‌ప్రింట్స్, కంటిపాప వంటి బయోమెట్రిక్స్ ఏమి వుండవు. కేవలం పేరు, తల్లిదండ్రుల పేరు, అడ్రస్, ఒక ఫొటో మాత్రమే చాలు. ఈ కార్డ్స్ ని తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌తో లింక్ చేస్తారు. ఈ కార్డు కేవలం చిన్నారులకు ఐదేళ్లు వచ్చే దాకే. తర్వాత వారి వేలిముద్రలు, బయోమెట్రిక్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవాలి. బ్లూ ఆధార్ కార్డు ఐదేళ్ల తర్వాత చెల్లుబాటు అవ్వదు.

దీని కోసం ముందు UIDAI అఫీషియల్ వెబ్‌సైట్ UIDAI.Gov.in కు వెళ్లాలి.
ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ మీద నొక్కాలి. పిల్లల పేరు, పేరెంట్స్ లేదా గార్డియన్ ఫోన్ నంబర్, పిల్లలు, సంరక్షకులు లేదా తల్లిదండ్రులకు సంబంధించిన వంటివి ఇవ్వాలి.
ఆధార్ రిజిస్టర్ చేసుకోవడానికి అపాయింట్‌మెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంది.
దగ్గర్లోని ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లో అపాయింట్‌మెంట్ తీసుకుని… గుర్తింపు కార్డు, అడ్రస్, పుట్టిన తేదీ, రిఫరెన్స్ నంబర్ వంటివి తీసుకెళ్లాలి.
ప్రాసెస్ పూర్తయితే తర్వాత ఆధార్ నమోదు కేంద్రం రసీదు సంఖ్య మీకు అందిస్తారు. దానితో బ్లూ ఆధార్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news