కరోనాతో కంటిచూపునకు ఇబ్బందా..?

-

కోవిడ్‌ మూలంగా కొందరిలో కంటి నరాలకు కొన్ని సమస్యలు తలెత్తి కంటిచూపు మందగిస్తోందని వైద్యలు పేర్కొటున్నారు. ఉన్నట్టుండి ఏదైన చూసినప్పుడు బ్లర్‌గా కన్పించడం, రెటీనాకు రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడుతుంది. కోవిడ్‌ బారిన పడి స్టెరాయిడ్స్‌ వాడి కోలుకున్న వారిలో ఇది ఎక్కువగా కన్పించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా కంటి వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.

 

కరోనా సమయంలో అత్యవసర కేసులను నేరుగా పరీక్షించాలని ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వైద్యనిపుణులకు సూచించింది. కంట్లో నొప్పి, రెప్పల గాయాలు, ఫొటోఫోబియా, రెటినాల్‌ డిటాచ్మెంట్, రెటినాల్‌ టియర్‌ లాంటి వాటిని ఎమర్జెన్సీ ట్రీట్‌మెంగా పరిగణించాలని కోరింది. ఎవరైన నేత్రదానం చేయాలనుకుంటే ఈ సమయంలో అత్యంత సురక్షిత పద్ధతుల్లోనే చేయొచ్చని ఆదేశిస్తోంది.

ఇవి చేయాలి..

1. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయాలంటే ఐసోలేషన్‌ వార్డు, లేదా ఓ ప్రత్యేక గతిని ఉపయోగించాలి. çసంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ తెలుసుకోవాలి.
2. ఒకవేళ కోవిడ్‌ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్‌ చేయకూడదు. అనారోగ్యం ఉన్నవారిని దూరంగా ఉంచాలి.
3. కెరాటోమెట్రీ, యూబీఎం, ఏస్కాన్, బీస్కాన్, గోనియోస్కోపీ, ఓసీటీ, టోనోమెట్రీ, ఎఫ్‌ఎఫ్‌ఎ తదితర పరీక్షలు చేస్తున్నప్పుడు ముందు, తర్వాత పరికరాలను శుభ్రంగా కడగాలి.
4. వైద్యుల సలహామేరకు కంట్లో మందు వేసేటççప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రోగికి తాకకుండా వేయాలి.

5. కంటైన్మెంట్‌ జోన్లలో కంటి ఆసుపత్రులు తెరవకూడదు. తద్వారా మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
6. క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కొవాలి. మాస్క్‌ ధరించి సామాజికి దూరం పాటించాలి.

చికిత్సలో స్టెరాయిడ్స్‌ వాడటంతో..

కోవిడ్‌ కరణంగా అధికంగా కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కంటి నరంలో వాపురావడం, ఆప్టిక్‌ నరం సమస్యలు ఎదురవుతున్నాయి. కంటికి సంబం«ధించిన మెదడుకు వెళ్తు్తన్న ఓ నరంలో రక్తం సరఫరా తగ్గుతుంది. అప్పుడే కంటి చూపు మందగిస్తుంది. చికిత్సలో స్టెరాయిడ్స్‌ మందులు వాడిన తర్వాత ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news