ఎలాంటి రక్తసంబంధం అయినా తెగేది డబ్బు దగ్గరే.. ఆస్తుల విషయాల్లో గొడవులు జరిగి హత్యలు చేసుకునే వరకూ కూడా వెళ్తారు. అయితే ఈరోజుల్లో కొంతమంది ఒక భార్యతో సరిపెట్టుకోవడం లేదు. సీక్రెట్‌గా సెకండ్ పార్టనర్‌ను కూడా మెయింటేన్ చేస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి ఆస్తిలో వాటా ఉండదు అనుకుంటారు. కానీ సహజీవనం చేస్తున్న లివ్ ఇన్ పార్నర్ సైతం, పార్ట్నర్ ఆస్తిలో వాటా డిమాండ్ చేయవచ్చు. దీనికి సంబంధించిన రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులు వారి తదనంతరం వారసులకు లేదా రక్తసంబంధీకులకు చెందుతాయి. కొంతమంది ఆస్తుల పంపిణీ ఎలా జరగాలి అనేది వీలునామా రాస్తారు. ఇది లీగల్ డాక్యుమెంట్. అయితే వీలునామా లేనప్పుడు, స్పష్టంగా ఆస్తుల పంపిణీ జరగనప్పుడు వారసుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. ఎవరికి ఎంత ఆస్తి దక్కుతుందో తెలుసుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తుంటారు.
సహజీవనం చేస్తున్న లివ్ ఇన్ పార్నర్ సైతం ఆస్తిలో వాటా డిమాండ్ చేయవచ్చు. ఉదాహరణకు ఇటీవల ఇద్దరు పిల్లల తండ్రి చనిపోయారు. 15 ఏళ్ల క్రితమే తల్లి కన్నుమూసింది. తండ్రి ఆస్తులను ఇద్దరు పిల్లల మీద రాశారు. అయితే మరణానికి ముందు తండ్రి ఓ మహిళతో సహజీవనం చేసేవారు. ఆమె ఇప్పుడు ఆస్తుల్లో వాటా కోరుతోంది. ఈ విషయంలో ఆమెకు చట్టపరంగా ఎలాంటి మద్దతు ఉంటుందనేది సుప్రీం కోర్టు తీర్పుల్లో చర్చించింది.
లివ్-ఇన్ రిలేషన్స్‌లో భాగస్వాములకు పుట్టిన పిల్లలను చట్టబద్ధ వారసులుగా పరిగణించవచ్చని కూడా తీర్పు చెప్పింది. కానీ దీనికి సంబంధించి అధికారిక చట్టం లేదు. మేల్ పార్ట్‌నర్‌కి చెందిన ఆస్తుల్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఫీమేల్ పార్ట్‌నర్‌కి ఉన్న హక్కులు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి.
తండ్రి వీలునామాను సహజీవనం చేస్తున్న మహిళ సవాలు చేసిన సందర్భంలో, వీలునామా వాస్తవికతను నిరూపించే భారం లేదా ప్రొబేట్ ప్రొసీడింగ్‌లో కాంటెస్ట్ చేయడానికి ఫీమేల్ పార్ట్‌నర్ అర్హత న్యాయస్థానంపై ఆధారపడి ఉంటుంది. ఆమె చేసిన వాటా క్లెయిమ్‌ను వ్యతిరేకించేందుకు వీలునామా లబ్ధిదారులు అవసరమైన ఆధారాలు అందజేయాలి. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా క్లెయిమ్‌ల చెల్లుబాటును కోర్టు నిర్ణయిస్తుంది. ఆస్తిలో వాటా పొందేందుకు ఉన్న అర్హత కారణాలను సహజీవనం చేసిన మహిళ కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది.
అర్హత నిరూపించుకోవాలి :

భారతదేశంలో ఒక వ్యక్తి వీలునామా లేకుండా మరణించినప్పుడు, వారి ఆస్తి పంపిణీ హిందూ వారసత్వ చట్టం ద్వారా నిర్ణయిస్తారు. ఈ చట్టం వారసులను రెండు వర్గాలుగా క్లాస్ I, క్లాస్ IIగా విభజిస్తుంది. మరణించినవారి ఆస్తిని వారసత్వంగా పొందడంలో క్లాస్ II వారసుల కంటే క్లాస్ I వారసులకు ప్రాధాన్యత ఉంటుంది. క్లాస్ I వారసులు ఉంటే, క్లాస్ II వారసులు ఎస్టేట్‌లో ఎలాంటి వాటాకు అర్హులు కారు.