ఫోన్ పే,గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్..

-

మన దేశంలో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాక నగదు లావాదేవీలు బాగా సులువు అయ్యాయి. చకచకా క్షణాల్లో పేమెంట్లు పూర్తి చేస్తున్నారు. ఈ తరుణంలో విదేశాలకు కూడా మన ఫోన్లలో యూపీఐ సేవల ద్వారా నగదు లావాదేవీలు చేయొచ్చు.. ఇకపోతే యూపీఐ ఆధారిత యాప్లు ఓపెన్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. ఇలా డిజిటల్ చెల్లింపులపై ఆధారపడడం తో ఆన్లైన్ మోసాల కేసులు పెరుగుతున్నాయి.

ఈ స్కామర్లు వినియోగదారులను మోసగించే అత్యంత సాధారణ మార్గాలలో QR కోడ్ల ద్వారా చెల్లింపులు కూడా ఒకటి. QR కోడ్ స్కామ్లు వేగంగా పెరుగుతున్నాయి.. వీటికి అడ్డుకునేందుకే అధికారులు ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.. ఇకపోతే ఫోన్ పే,గూగుల్ పే యూజర్స్ కు మరో గుడ్ న్యూస్..

డెబిట్ కార్డు,క్రెడిట్ కార్డు లు లేకుండా డిజిటల్ పేమెంట్స్ చెయ్యడం మనం చుసాము.. కానీ ఇప్పుడు డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చునట అదేలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. SBI, PNB, HDFC బ్యాంకులు మాత్రమే ఈ సర్వీసును అందిస్తున్నాయి.. ఈ సేవలు అందిస్తున్న ఏటీఎం కొన్ని మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది.ఏటీఎం మిషన్ పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి, ఎంత అమౌంట్ కావాలో ఎంటర్ చేసి,మీ యూపీఐ పిన్ ను ఎంటర్ చెయ్యాలి. డబ్బులు డ్రా అవుతాయి..ఇక్కడ గుర్తించు కొవాల్సిన విషయం ఏంటంటే.. రూ.5000 వరకూ మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు..ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. అత్యవసర పరిస్థితులలో ఇది ఉపయోగపడుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news