త్వరలో పేటీఎంలో ‘ఫేస్ లాగిన్’ ఫీచర్!

-

మొట్టమొదటి మనీ వాలెట్ పేటీఎం రోజురోజుకూ తన సెక్యూరిటీ ఫీచర్లను పెంచుకుంటూ పోతున్నది. ఆండ్రాయిడ్ బీటా యాప్ లో ఫేస్ లాగిన్ ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే పేటీఎం యూజర్లు పేటీఎం యాప్ ను ఓపెన్ చేసి జస్ట్ స్క్రీన్ వైపు చేస్తే చాలు. యూజర్ ఫేస్ ను పేటీఎం డిటెక్ట్ చేసి యాప్ లోకి లాగిన్ చేస్తుంది.

ముఖ్యంగా సైబర్ అటాక్స్ నుంచి యూజర్లకు కాపాడటం కోసమే ఈ సెక్యూరిటీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేటీఎం వెల్లడించింది. ఇప్పటి వరకు పదివేల ముఖాలతో ఈ యాప్ ను టెస్ట్ చేసింది పేటీఎం. 100 శాతం ఖచ్చితత్వంతో ఆ ముఖాలు పనిచేశాయట. ముఖాన్ని లాగిన్ కోసం తీసుకునేటప్పుడు దాదాపు 200 రకాల పారామీటర్స్ ను మ్యాప్ చేస్తుందట పేటీఎం. 200 రకాల పారామీటర్స్ మ్యాప్ అయితేనే పేటీఎంలోకి లాగిన్ అవుతుంది.

“బయోమెట్రిక్ సెక్యూరిటీలో భాగంగా ఫిషింగ్ అటాక్స్ నుంచి రక్షణ పొందడం కోసం ఈ సెక్యూరిటీ అప్ డేట్ ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతిసారి పాస్ వర్డ్ ను రీసెట్ చేసుకునే అవసరం కూడా ఉండదు. యాప్ లో ఎక్కువగా లావాదేవీలు జరుగుతున్నందున యూజర్లకు పటిష్టమైన సెక్యూరిటీని అందించడం మా బాధ్యత. దాని కోసమే మా టీం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్..” అని పేటీఎం తెలిపింది.

పేటీఎం ఇదివరకే పిన్, పాస్ వర్డ్, ప్యాటర్న్, ఫింగర్ ప్రింట్ తో యాప్ లోకి లాగిన్ అయ్యే ఆప్షన్ ను యూజర్లకు కల్పించింది. అయితే.. ఇదంతా సెకండ్ లేవల్ సెక్యూరిటీ. ఈమధ్య స్మార్ట్ ఫోన్లలోనూ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఫేసియల్ రికగ్నిషన్ ఫీచర్ అనేది అంత పటిష్టంగా ఉండదు. హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువ. యాపిల్ కంపెనీ ఫేసియల్ రికగ్నిషన్ ఫీచర్ కోసం ట్రూడెప్త్ సెన్సార్, త్రీడీ మ్యాపింగ్ ను ఉపయోగిస్తుంది. అవి చాలా పటిష్టమైన ఆప్షన్లు. ఆండ్రాయిడ్ మాత్రం బేసిక్ 2డీ మ్యాపింగ్ ను ఉపయోగిస్తుంది. అందుకే.. ఫేసియల్ రికగ్నిషన్ ఫీచర్ పటిష్టమైనది కాదు అంటూ చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ తమ యూజర్లకు ముందే వెల్లడిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news