అన్నదాతలకు తీపికబురు.. రూ.1,00,000 బెనిఫిట్!

-

రైతులకి గుడ్ న్యూస్. దీని వలన మంచి లాభం వుంది. మీరు ఎవరైనా కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేస్తే అప్పుడు మీకు రూ.లక్ష వరకు బెనిఫిట్ లభిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… వాహన తయారీ కంపెనీ, అగ్రి ఎక్విప్‌మెంట్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన కస్టమర్లకు ఈ ఆఫర్ ని రైతుల కోసం అందిస్తోంది.

రూ.లక్ష వరకు ప్రయోజనం కల్పిస్తోంది. కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతులకు మాత్రమే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. ఇది ఇలా ఉంటే రైతుల కోసం ఎం ప్రొటెక్స్ కోవిడ్ ప్లాన్ ఆవిష్కరించింది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రిఅప్రూవ్డ్ ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్ పాలసీ వస్తుంది.

దీనితో రైతులు ఈ లాభాన్ని పొందవచ్చు. కరోనా నుండి రక్షణ కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసారు. ఎవరికైనా కరోనా వస్తే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.లక్ష వరకు లభిస్తుంది.

ఎం ప్రొటెక్ట్ ప్లాన్ కింద రైతులకు హెల్త్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ లభిస్తాయని కంపెనీ తెలిపింది. దీనితో ఆ డబ్బులతో చికిత్స చేయించుకోవచ్చు. ఇంకా ప్రిఅప్రూవ్డ్ రుణాలు కూడా లభిస్తాయి అని వెల్లడించారు. ఒకవేళ రుణ గ్రహీత మరణిస్తే.. మహీంద్రా లోన్ సురక్ష కింద లోన్ డబ్బులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news