తెరాస పార్టీపై మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తల్లి, బిడ్డను వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారం శాశ్వతం అనుకుంటే భ్రమలో ఉన్నట్టే అని అన్నారు. హుజురాబాద్ ప్రజలను తన నుంచి వేరు చేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నా ప్రాణం ఉన్నంత వరకు హుజురాబాద్ ప్రజలను కాపాడుకుంటా అంటూ కూడా ఆయన స్పష్టం చేసారు.
నోరు అదుపులో లేకపోతే మాత్రం కరీంనగర్ నుంచే ఉద్యమం చేస్తా అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కొందరు నాయకులు తోడేళ్ళ మాదిరిగా గొర్రెల మంధపై పడుతున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. హుజారాబాద్ లో మీ రాజకీయాలు నడిచే అవకాశం లేదని ఆయన స్పష్టం చేసారు. హుజారాబాద్ ఎన్నిక జరిగితే తనకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేసారు.