కొడుకుకి 18 ఏళ్లు దాటితే తండ్రి బాధ్యత తీరిపోదు: ఢిల్లీ హైకోర్టు..!

విడాకులు ఇచ్చిన భార్య కి తన కొడుకు బాధ్యత కోసం 15000 తండ్రి పంపిస్తున్నాడు. అయితే పద్దెనిమిదేళ్లు నిండినప్పుడు తండ్రి బాధ్యత పూర్తి కాదని తన విద్య మరియు ఇతర ఖర్చులు తల్లి పెడుతుందని కానీ తండ్రి బాధ్యత 18 ఏళ్లు దాటితే అయిపోదు అని కోర్టు చెప్పింది.

పిటిషనర్ నెంబర్ వన్ మహిళ తన సొంత ఖర్చులని తానే భరించాల్సి వుంది. పిటిషనర్ నెంబర్ 2 కొడుకు ఎవరైతే పెద్దవాడు అయ్యాడు కానీ ఇంకా చదువుకుంటున్నాడు. అయితే ఫ్యామిలీ కోర్టు ఏమంటుందంటే..? పిటిషనర్ నెంబర్ వన్ మహిళా సంపాదన సరిపోవడం లేదు. కాబట్టి కుటుంబం నిలబడడానికి అది సరిపోదు అని జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ అన్నారు.

నవంబర్ 1997 లో ఈ భార్య భర్తలకు వివాహం జరిగింది. వాళ్లకి ఇద్దరు పిల్లలు. నవంబర్ 2011లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. వీళ్ళకి 20ఏళ్ళ కూతురు, పద్దెనిమిదేళ్ళ కొడుకు ఉన్నారు. ఫ్యామిలీ కోర్టు ఆర్డర్ ప్రకారం కొడుకు ఎప్పుడైతే మేజర్ అవుతాడో అప్పటివరకు మెయింటెనెన్స్ తీసుకోవాలి.

కుమార్తె ఎప్పుడు వరకు అయితే ఉద్యోగం చేస్తుందో లేదా పెళ్లి అవుతుందో అప్పటి వరకూ మెయింటనెన్స్ తీసుకుంటుంది. అయితే ఇద్దరు పిల్లలు కూడా తమ తల్లి దగ్గరే ఉంటున్నారు. ఈ పరిస్థితిని చూస్తుంటే తన కొడుకు కేవలం 18 ఏళ్లు వచ్చాయి అంటే పన్నెండవ తరగతి చదువుతున్నాడు.

ఇంక తను ఉద్యోగం చేయడం లేదు అందు వలన తల్లి మొత్తం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. కొడుక్కి 18 ఏళ్ళు వచ్చాయి కాబట్టి తండ్రి బాధ్యత అయిపోయినట్లు కాదు.

కేవలం తల్లి మాత్రమే ఈ ఖర్చు అంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తనకి, కొడుకుకి, కూతురుకి ఆమె సంపాదన సరిపోదు. అందుకని ఫ్యామిలీ కోర్టు కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకూ interim maintenance కింద 15000 ఇవ్వాలని అంది.

గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకూ నెలకి 15000 అందుతాయి. ఇది ఇలా ఉంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఆదాయం 1.67 లక్షలు అని శాలరీ సర్టిఫికెట్ ద్వారా తెలుస్తోంది. అయితే నిజం ఏమిటంటే ఆ వ్యక్తి మరొక పెళ్లి చేసుకున్నాడు.