టీటీడీ పాలక మండలి ముగిసిన గడువు… స్పెసిఫైడ్ అథార్టీ నియామకం

తిరుమల : టిటిడి పాలకమండలిగా స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది ఏపీ రాష్ర్ట ప్రభుత్వం. టీటీడీ బోర్డ్ కాలపరిమితి ముగియడంతో స్పెసిఫైడ్ అథార్టీని నియమించింది ప్రభుత్వం. అంతేకాదు.. టిటిడి ఇఓ జవహర్ రెడ్డి చైర్మన్ గా…. అడిషనల్ ఇఓ దర్మారెడ్డి కన్వీనర్ గా నియామకం చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదికి ముగిసిన గత పాలకమండలి గడువు ముగియనున్నది. అంతే కాదు టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు  స్పెసిఫైడ్ కొనసాగుతుందని ఏపీ సర్కార్ పేర్కొంది. ఉద్యోగులకు గాని భక్తులకు గాని టీటీడీ పాలకమండలి తరహాలోనే.. కొత్తగా నియమించిన  స్పెసిఫైడ్ అథారిటీ అన్ని వ్యవహారాలను చూసుకుంటుందని తెలిపింది.

ttd
ttd

కాగా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. కరోనా నేపథ్యంలో పరిమితిని మించి భక్తులకు అనుమతులు ఇవ్వడం లేదు.  దీంతో మామూలు టైం లో కంటే ప్రస్తుతం దర్శనాల సంఖ్య భారీగా తగ్గింది. అటు శ్రీవారి ఆదాయం కూడా తగ్గింది.