డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం ఇక సులభమే.. మార్చి నుంచి అంతా ఆన్‌లైన్‌లోనే..!

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లే కాదు.. ఆర్టీఏకు సంబంధించిన ఏ పని అయినా సరే రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పటికే ఈ శాఖకు చెందిన అనేక సేవలను ఆన్‌లైన్‌ చేశారు. కానీ కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అనేక రవాణా సేవలు దాదాపుగా ఆన్‌లైన్‌లోనే లభ్యం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది.

from march all states will provide online services for rto

ఇప్పటి వరకు యూపీ, బీహార్‌, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో 90 శాతం వరకు ఆర్‌టీవో సేవలను ఆన్‌లైన్‌లోనే అందించారు. కేవలం డ్రైవింగ్‌ టెస్టులు, వాహన ఫిట్‌నెస్‌ టెస్టులకు మాత్రమే రవాణా శాఖ కార్యాలయాలకు ప్రజలు వెళ్లారు. పైన తెలిపిన రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు ఈ విధంగా ఉంది. కానీ మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్‌టీవో సేవలను ఆన్‌లైన్‌లోనే అందివ్వనున్నారు. దీంతో వాహనదారులు తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌, వాహన ఫిట్‌నెస్‌ టెస్టుల కోసం మాత్రమే రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని పనులు ఆన్‌లైన్‌లోనే పూర్తవుతాయి.

వాహనదారులు ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలంటే రవాణా శాఖ కార్యాలయంలో అప్లికేషన్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లోనే అందుకు అప్లై చేయవచ్చు. సంబంధిత పత్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాక నిర్ణీత తేదీలో కార్యాలయానికి వెళ్లి టెస్టుకు హాజరు అయితే చాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సులభంగా వస్తుంది. ఇలాగే దాదాపుగా అన్ని పనులను ఆన్‌లైన్‌లోనే చేసుకునేందుకు వీలు ఏర్పడింది. ఇప్పటి వరకు ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే ఆర్‌టీవో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ మార్చి నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్‌టీవో కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...