819 రూపాయల గ్యాస్ సిలిండర్ ని ఇప్పుడు 19 రూపాయలకి పొందండి…!

LPG సిలిండర్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ ధర 225 రూపాయలు పెరిగిపోయింది. ఢిల్లీలో సబ్సిడైజ్డ్ 14.2 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర 819 రూపాయలుగా ఉంది. కానీ ఇప్పుడు పేటీఎం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ ద్వారా 819 రూపాయల గ్యాస్ సిలిండర్ ని 19 రూపాయలకే పొందొచ్చు.

ఇలా చేస్తే 800 రూపాయలు క్యాష్ బ్యాక్ మీకు లభిస్తుంది. దీని కోసం మీరు ఎల్పిజి సిలిండర్ ని పేటియం ద్వారా బుక్ చేసుకోవాలి. పేటియం స్పెషల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద 19 రూపాయలకే సిలిండర్ ని ఇలా పొందొచ్చు.

ఈ ఆఫర్ ని ఎలా పొందాలి..?

దీనికోసం ముందుగా పేటీఎం యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి.
ఇప్పుడు పేటీఎం లోకి వెళ్లి క్లిక్ ఆన్ షో మోర్ లోకి వెళ్ళండి.
ఇప్పుడు రీఛార్జ్ మరియు పే బిల్స్ లోకి వెళ్ళండి.
ఇప్పుడు బుకింగ్ సిలిండర్ ఆప్షన్ ని ఓపెన్ చేసి భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ లేదా ఇండియన్ గ్యాస్ ఇలా ఏదైతే దానిని సెలెక్ట్ చేసుకోండి.
రిజిస్టర్ మొబైల్ నెంబర్ ని టైప్ చేయండి.
పేమెంట్ ఆప్షన్ ని ఎంచుకుని FIRSTLPG ఈ ప్రోమో కోడ్ ని ఎంటర్ చేయండి.

దీంతో  క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ 31 మార్చి తో ఎక్స్పైర్ అయిపోతుంది. దీని కోసం మీకు 7 రోజులు మాత్రమే ఉన్నాయి. 24 గంటల్లో మీకు క్యాష్ బ్యాక్ స్ట్రార్చ్ కార్డు వస్తుంది. దీనిని వారం రోజుల్లోగా మీరు ఉపయోగించాలి.