మీకు ఫోర్ వీలర్ లేదా ఏదైనా హెవీ వెహికల్ ఉందా…? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు చెప్పింది. అదేమిటంటే వాహనదారులకి ఉచితం గానే ఫాస్టాగ్ అందిస్తున్నట్లు చెప్పడం జరిగింది. మార్చి 1 వరకు ఈ బెనిఫిట్ ని మీరు పొందవచ్చు. కారు కానీ హెవీ వెహికల్ కానీ ఉంటె మీరు ఈ అవకాశాన్ని పొందవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడే చూసేయండి.
వివరాల లోకి వెళితే… కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఉచితం గానే ఫాస్టాగ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ అవకాశం కేవలం 2021 మార్చి 1 వరకు మాత్రమే. దీనితో వాహనదారులకు రూ.100 ఆదా చేసుకోవచ్చు. హైవే యూజర్లు ఫాస్టాగ్ వినియోగించడాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇప్పటి దాకా ఫాస్టాగ్ మీరు తీసుకొన్నట్లయితే ఈ ఉచిత ఆఫర్ ని మీరు ఉపయోగించుకోవచ్చు. అలానే బ్యాంకులు కూడా వాటి కస్టమర్లకు ఫాస్టాగ్ సేవలు అందిస్తున్నాయి. కనుక మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ లేదా ఆన్‌లైన్ ద్వారా ఫాస్టాగ్ ని పొందొచ్చు. ఫాస్టాగ్ తప్పక ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానా పడుతుంది.