తూర్పు గోదావరి జిల్లా, కచ్చులూరు దగ్గర ప్రవాహం దాటికి నీటిలో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు మళ్లీ ధర్మాడి సత్యం బృందం ప్రయత్నిస్తోంది. ఇవాళ్టి నుంచి బోటు వెలికితీత పనులు మొదలుకానున్నాయి. గత నెల 30 న బోటు వెలికితీత పనులు ప్రభుత్వం సత్యం బృందానికి అప్పగించింది. లంగర్లు వేసి బోటును వెలికితీసేందుకు ప్రయత్నించింది.
అయితే వరద ఉధృతి పెరగడంతో ఈ నెల 3 న పనులకు విరామం ఇచ్చారు. మళ్లీ ఇవాళ్టి నుంచి పనులు మొదలుకానున్నాయి. ఇప్పటికే కచ్చులూరుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. గత నెల 15 న కచ్చులూరు దగ్గర బోటు మునిగిపోవడంతో ఇప్పటివరకు 38 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.