ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులకు శుభవార్త…!

మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా..? అయితే ఇది నిజంగా మీకు శుభవార్తే..! తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు తీపి కబురు చెప్పాయి. అది ఏమిటంటే..?
స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ గడువును పొడిగిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇలా పొడిగించడం కారణంగా మార్చి 31 వరకు ఈ స్కీమ్స్ అందుబాటులో ఉండనున్నట్టు చెప్పాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… దిగ్గజ బ్యాంకులు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ FD స్కీమ్స్ గడువును ఎక్స్టెండ్ చేసాయి. కరోనా వైరస్ మూలంగానే ఇలా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా సీనియర్ సిటిజన్స్ కోసం బ్యాంకులు ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్స్ ని ఇది వరకే తీసుకొచ్చినట్టు కూడా మనకి తెలిసినదే. ఇక స్పెషల్ ఎఫ్‌డీ గురించి చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ పేరుతో ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద డబ్బులు ఎఫ్‌డీ చేస్తే 80 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ కింద వడ్డీ రేటు 6.3 శాతంగా ఉంది. అదే ఎస్‌బీఐలో అయితే కేవలం 6.2 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్ సిటిజన్ కేర్ పేరుతో స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ తీసుకు రాగా… సీనియర్ సిటిజన్స్‌కు 75 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ వస్తుంది. ఒకవేళ మీరు ఈ స్కీమ్ కింద బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే 6.25 శాతం వడ్డీ మీకు వస్తుంది. 5 నుండి 10 ఏళ్ళు కనుక రూ.5 కోట్లకు లోపు ఎఫ్‌డీ చేస్తే 0.25 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది.