ఆధార్ కార్డు ఉన్న వారికి తీపికబురు.. యూఐడీఏఐ కొత్త సర్వీసులు…!

-

ఆధార్ కార్డు ఉన్నవాళ్ళకి ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు అందుబాటు లోకి తీసుకు వచ్చింది. దీని వల్ల ఆధార్ సర్వీసులు మరెంత సురక్షితంగా మారాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సర్వీసులు ని తీసుకు వచ్చింది. కొత్త సెక్యూరిటీ సేవలను లాంచ్ చేసింది. ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్ కోసం ఈ సేవలని తీసుకు రావడం జరిగింది.

మోసపూరిత ట్రాన్సాక్షన్లను గుర్తించాలని ఈ సేవలని తీసుకు వచ్చింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ బేస్ట్ సెక్యూరిటీ మెకానిజం. స్వదేశీ టెక్నాలజీతోనే దీన్ని రూపొందించారు. ఫింగర్ ప్రింట్ మెమినిషియా, ఫింగర్ ఇమేజ్ ఆధారంగా పని చేస్తుంది ఇది. ఫింగర్ ప్రింట్‌ను సరిగ్గా గుర్తిస్తుంది. ఫింగర్ ప్రింట్ అనేది చనిపోయిన వాళ్లదా కాదా అనేది తెలుస్తుంది.

ఫింగర్ ప్రింట్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్ల లో మోసాలకు చెక్ పెట్టవచ్చు. కొత్త టూ ఫ్యాక్టర్ లేదా టూ లేయర్ అథంటికేషన్ ద్వారా భద్రత ని పొందొచ్చు. ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్ కూడా బలోపేతం అవుతుందని పేర్కొంది. 2022 డిసెంబర్ చివరి నాటికి ఆధార్ బేస్డ్ అథంటికేషన్ ట్రాన్సాక్షన్లు 88.29 బిలియన్లు దాటాయి.

రోజుకు సగటున 70 మిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదు అయ్యాయి. ఎక్కువ శాతం ఫింగర్ ప్రింట్ అథంటికేషన్ ట్రాన్సాక్షన్లే ఉన్నాయి. యూఐడీఏఐ ఇటీవలనే ఏఐ లేదా ఎంఎల్ బేస్ట్ చాట్ బాట్ సర్వీసులు కూడా తెచ్చింది. అదే ఆధార్ మిత్ర. ఆధార్ నమోదు, ఆధార్ అప్‌డేట్, ఆధార్ పీవీసీ కార్డుల స్టేటస్ వంటి పలు రకాల సర్వీసులని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news