ఎయిర్‌టెల్ నుండి శుభవార్త..కస్టమర్లకు రుణాలు

-

పండుగ సమయంలో కొత్త స్మార్ట్‌ ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచన చేసేవారికి ఒక గొప్ప శుభవార్త. ప్రస్తుతం ఎయిర్టెల్ తన కస్టమర్లకు రుణాలు అందిస్తోంది. కొత్త 4జీ ఫోన్ కొనే వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రముఖ దిగ్గజ టెలికం కంపెనీ అయిన ఎయిర్టెల్ ఇప్పుడు తమ కస్టమర్లకు రుణాలు కూడా అందిస్తోంది. పండుగ వేళలో కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచన చేసేవారికి ఇది ఊరట కలిగించే అంశం.

 

అర్హత కలిగిన ఎయిర్టెల్ 2జీ కస్టమర్లుకి 4జీ హ్యాండ్‌ సెట్‌ కు అప్ ‌గ్రేడ్ అవ్వడానికి లోన్ సదుపాయం తీసుకోవచ్చు. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే 4జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. కస్టమర్లుకి లోన్ అందించేందుకు ఎయిర్టెల్ తాజాగా ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ‌తో జతకట్టింది. అయితే లోన్ సదుపాయం పొందాలని అనుకున్న వారు మాత్రం కొంత డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం మొదట 3,259 రూపాయలు చెల్లించాలి. అయితే మార్కెట్‌లో మాత్రం 4జీ ఫోన్‌కు డౌన్ పేమెంట్ రూ.6,800 కట్టాలి. అలాగే తీసుకున్న ఋణం మొత్తం 10 నెలల్లో చెల్లించాల్సి వస్తుంది.. అంటే నెలకు ఈఎంఐ రూ.603 ఉంటుంది. అంటే కేవలం రూ.9,300 కి 4జీ హ్యాండ్‌సెట్ లభిస్తుంది.

ఎయిర్టెల్ 2జీ కస్టమర్లకే ఈ లోన్ వర్తిస్తుంది. లోన్ తీసుకున్న వినియోగదారులు వారి కొత్త ఫోన్‌లో 60 రోజులు పాటు ఎయిర్టెల్ ప్లాన్ వాడాలి. వీరికి రూ. 249 బండిల్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఎయిర్టెల్ తన వీవో వైఫై సపోర్ట్ సేవలను 200 హ్యాండ్‌సెట్లకు పైగా అందుబాటులోకి తీసుకొని వచ్చింది. వాయిస్ ఓవర్ వైఫై సదుపాయం ద్వారా కస్టమర్లకు కాల్ కనెక్టివిటీ బాగుంటుంది. ఇప్పుడు దీపావళి పండుగ నేపథ్యంలో మరోసారి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్స్ తో తమ కస్టమర్లును ఆకర్షించనుంది. ముఖ్యంగా లోన్ సదుపాయం తీసుకోవాలని ఆలోచన ఉన్నవారికి ఇది ఒక శుభవార్త. కస్టమర్లకు రుణాలుతో పాటు కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తుంది టెలికాం కంపెనీ ఎయిర్టెల్.

Read more RELATED
Recommended to you

Latest news