స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల హ్యాకర్స్ మన వ్యక్తి జత జీవితంలోకి అలవోకగా వస్తున్నారు. కొన్ని యాప్స్ లలో వారి మాల్ వేర్ లను పంపించి వాటి నుంచి మన వ్యక్తి గత సమాచారాన్ని లాగుతున్నారు. దీని పై గూగుల్ ఎప్పటి కప్పుడు జాగ్రత్త గా ఉంటు ఆయా యాప్స్ ను తొలగిస్తుంది. తాజా గా గూగుల్ మరో 7 ప్రమాదకరమైన యాప్స్ ను గూగుల్ గుర్తించింది.
ఈ యాప్స్ ను అందిరి ఫోన్ ల నుంచి తొలగించాలని కూడా సూచించింది. అంతే కాకుండా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ మ7 ప్రమాదకరమైన యాప్స్ ను తొలగించింది. అయితే ఆ 7 ప్రమాదకరమైన యాప్స్ ఎంటి అంటే.. క్యూ ఆర్ కోడ్ స్కాన్, ఇమోజి వన్ కీబోర్డ్, బ్యాటరీ చెంజింగ్ అనిమేషన్, డాజిలింగ్ కీబోర్డ్, వాల్యూమ్ బుస్టర్ లౌడ్ సౌండ్, సూపర్ హీరో ఎఫర్ట్ , క్లాసిక్ ఎమోజీ కీబోర్డ్ ఉన్నాయి. ఈ యాప్స్ ఉన్న వారు వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ సూచించింది.