గూగుల్‌ నుంచి కొత్త ఫీచర్‌.. డ్రైవింగ్‌ మోడ్‌!

-

గూగుల్‌ అసిస్టెంట్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టెక్‌ దిగ్గజం ఈ సరికొత్త ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు గూగుల్‌ అసిస్టెంట్‌ డ్రైవింగ్‌ మోడ్‌ అనే నయా ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. కేవలం యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, గ్రేట్‌ బ్రిటన్, ఐర్లాండ్‌ గూగుల్‌ యూజర్లకు అందుబాటులోకి ఉండనుంది. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీని పనితీరు ఎలా ఉంటుందో, ఏ డివైజ్‌లు సహకరిస్తాయో తెలుసుకుందాం.

మీరు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు దృష్టిని కేంద్రీకృతం చేస్తుంది. ఫోన్‌ అటెండ్‌ చేయడం, మ్యూజిక్‌ ప్లే చేయడం వంటి పనుల్ని డ్రైవింగ్‌ చేస్తూ వాయిస్‌ అసిస్టెంట్‌ ద్వారా చేయవచ్చు. తద్వారా కేవలం డ్రైవింగ్‌పైనే శ్రద్ధ వహించేలా చేస్తుంది. గూగుల్‌ నావిగేషన్‌ స్క్రీన్‌ ను వదలకుండానే డ్రైవింగ్‌ మోడ్‌ ఈ పనుల్ని చేస్తుంది. యాక్సిడెంట్లను జరగకుండా నివారిస్తుందని గూగుల్‌ తెలిపింది. , స్పాటిఫై, గూగుల్‌ పాడ్‌కాస్ట్, మరెన్నో మ్యూజిక్‌ లైబ్రరీల నుంచి వాయిస్‌ అసిస్టెంట్‌తోనే సంగీతాన్ని ప్లే చేయవచ్చు.

గూగుల్‌ డ్రైవింగ్‌ మోడ్‌ను యాక్టివేట్‌ చేసే విధానం

ఈ ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ చేస్తున్నారు. ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారులకు ఇప్పటికే పరిచం చేసింది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకునే విధానం..

  • గూగుల్‌ మ్యాప్స్‌లోని అసిస్టెంట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ట్రాన్‌ పోర్టేషన్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఈ ఫీచర్‌ ఆన్‌ అవుతుంది. అయితే, ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ 9.0 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించవచ్చని గూగుల్‌ తెలిపింది. 4 జీబీ ర్యామ్‌ లేదా అంతకంటే ఎక్కువ ర్యామ్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో ఇది పనిచేస్తుంది. ఈ విధంగా ఈజీగా గూగుల్‌ డ్రైవింగ్‌ మోడ్‌ను సెట్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news