పేరు మారింది.. గూగుల్ తేజ్ కాదు.. ఇకనుంచి గూగుల్ పే!

-

Google TEZ App గురించి స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ్ యాప్ అనేది పేమెంట్స్ సర్వీస్ యాప్. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేసుకొని కేవలం మొబైల్ నెంబర్ తో వేరే తేజ్ యూజర్ కు క్షణాల్లో ఈ యాప్ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చు. ప్రతి లావాదేవీకి ఒక స్క్రాచ్ కార్డును తేజ్ యాప్ ద్వారా పొందొచ్చు. దాన్ని స్క్రాచ్ చేస్తే ఎంతో కొంత డబ్బులు గెలుచుకోవచ్చు. ఇలా.. మినిమమ్ 150 రూపాయల నుంచి తేజ్ యాప్ ద్వారా డబ్బులు పంపించి స్క్రాచ్ కార్డుల ద్వారా డబ్బులు గెలిచిన వాళ్లు కోకొల్లలు.

ఇంకా.. రకరకాల ఆఫర్లతో తేజ్ యాప్ ఆద్యంతం యూజర్లను ఆకర్షిస్తుంటుంది. ఫ్రైడే స్క్రాచ్ కార్డ్స్, స్పార్క్స్, నెలవారి బిల్లుల ద్వారా, ఎంఐ.కామ్, రిలయెన్స్ బిల్లుల ద్వారా ఇలా రకరకాల పేమెంట్స్ చేసి డబ్బులు గెలుచుకోవచ్చు ఈ యాప్ ద్వారా. అందుకే ఈ యాప్ మార్కెట్ లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఫేమస్ అయిపోయింది.

దీంతో ఎవరైనా డబ్బులు పంపించాలన్నా… పొందాలన్నా ఎక్కువగా తేజ్ నే వాడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు తేజ్ యాప్ గా పేరున్న ఈ యాప్ పేరును గూగుల్ కంపెనీ మార్చేసింది. ఇప్పుడు దీనికి గూగుల్ పే అని నామకరణం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2018 ప్రోగ్రామ్ లో గూగుల్ ఈ విషయాన్ని ప్రకటించింది. పేరు మార్చడంతో పాటు మరికొన్ని ఫీచర్లను యాప్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. కానీ.. యాప్ లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇండియాలో గూగుల్ పే ను 2.2 కోట్ల మంది వినియోగిస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఈ యాప్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 75 కోట్ల లావాదేవీలు జరిగాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version