రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయా..? అయితే ఇలా చెయ్యండి..!

-

మీకు రేషన్ కార్డు వుందా..? అయితే రేషన్ ని ప్రతీ నెలా తీసుకుంటున్నారా..? చాలా మంది రేషన్ కార్డు వున్నవాళ్లు ప్రతీ నెలా రేషన్ ని అందుకుంటుంటారు. అయితే కొంత మందికి రేషన్ తీసుకునేటప్పుడు సమస్యలు కలుగుతాయి. మీరు కూడా రేషన్ సరుకులు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారా..? అయితే తప్పక మీరు ఇలా చెయ్యాలి.

ఇలా కనుక మీరు చేస్తే రేషన్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రేషన్ కార్డులో సమస్యల కోసం కేంద్ర ప్రభుత్వం పలు నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెంబర్లకి కాల్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం అందించిన ఈ నెంబర్లకు ఫోన్ చేసి రేషన్ సరుకులు తీసుకోవడంలో మీరు పడుతోన్న ఇబ్బందులను వారికి చెప్తే వాటిని వాళ్ళు పరీక్షిస్తారు.

దీనితో ఆ సమస్య నుండి మీరు బయట పడచ్చు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలందరికీ కరోనా కేసులు తీవ్రంగా పెరగడంతో మార్చి 2020 నుంచి ఉచితంగా రేషన్ సరుకులను ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచితంగా 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను ఇచ్చింది.

ఈ స్కీమ్ ని మార్చి 2022 వరకు కూడా ఎక్స్టెండ్ చెయ్యడం జరిగింది. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందుకని ప్రజలు ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వం ప్రతి వ్యక్తికి నెలకు 5కేజీల ఆహార ధాన్యాలను పీఎంజీకేఏవై కింద ఇస్తోంది. ప్రజలకి రేషన్ సరుకులు తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమకు తెలియజేయాలని రాష్ట్రానికి ఒక నెంబర్ కేటాయించారు. ఏపీ 1800-425-2977, తెలంగాణ 1800-4250-0333.

Read more RELATED
Recommended to you

Latest news