గూగల్ లో సెర్చ్ బాక్స్ కింద ఈ ఆప్షన్ ఎప్పుడైనా చూశారా..దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో..!

మనం రోజు చూసే చాలా విషయాలు మనం పెద్దగా పట్టించుకోము. అసలు అ‌వి ఎందుకు ఉన్నాయి అనికూడా మనకు డౌట్ రాదు. చాలామంది మనపనేదో మనం చూసుకుందాం అనే ధోరణిలోనే ఉంటారు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా మనకు తెలియకు వాటిని లైట్ తీసుకుంటాం..అలాంటిదో మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్.
ఏ చిన్న సమాచారం కావాలన్న గూగుల్ లోనే వెతకటం అలవాటు. రోజులో ఎన్నోసార్లు గూగుల్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన ప్రతిసారి..సెర్చ్ బాక్స్ లో మనకు కావాల్సింది టైప్ చేసి ఎంటర్ కొడతాం కానీ, దాని కింద ఉండే ఒక ఆప్షన్ గురించి ఏరోజైనా పట్టించుకున్నారా అసలు గమనించారా అంటే దాదాపు లేదునే అంటారు. ఎందుకంటే అది ఏంటో దాని అవసరం మనకు లేదనుకోవడమే..ఎంటర్ కొట్టి వచ్చిన సైట్ లో బెస్ట్ సెలెక్ట్ చేసి వాడుకుంటాం.
గూగుల్ కింద రెండు ఆప్షన్స్ ఉంటాయి. అవి ఒకటి “గూగుల్ సెర్చ్”, మరొకటి “అయామ్ ఫీలింగ్ లక్కీ” అని రెండు బటన్స్ ఉంటాయి. వీటిల్లో మనం ఏదైనా గూగుల్ బాక్స్ లో టైపు చేసి గూగుల్ సెర్చ్ ను క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వబడుతుంది. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అందుకు సంబంధించిన సమాచారమంతా గూగుల్ మనకి చూపిస్తుందని మనందరకి ఇది తెలుసు.
అయితే.. ఈ కింద చూపించే సైట్లలో మంచి స్టాండర్డ్ ఉన్న సైట్లను, మంచి ఇన్ఫర్మేషన్ ను ఇచ్చే వెబ్సైట్లను ఆర్డర్ లో చూపిస్తూ ఉంటుంది. వాటిల్లో మనకు నచ్చింది ఎంచుకుంటాం. అయితే.. మనకు కావాల్సిన సబ్జెక్టు ను సెర్చ్ బాక్స్ లో టైపు చేశాక, సెర్చ్ బటన్ ను కాకుండా.. “అయామ్ ఫీలింగ్ లక్కీ” అనే బటన్ ను క్లిక్ చేస్తే వెంటనే ఏ సైట్ అయితే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ను ఇస్తుందో ఆ సైట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. మనం గూగుల్ లో చూపించే సైట్ లలో వెతకి, వాటిల్లో బెస్ట్ సెలక్ట్ చేసుకునే అవసరం ఉండదు. ఇలా యూజర్ల టైం ను సేవ్ చేయడం కోసమే.. గూగుల్ ఈ బటన్ ను తీసుకొచ్చింది. ఆ విషయం తెలియక మనం పది సైట్స్ చూడంటం దాంట్లో నాలుగు సెలక్ట్ చేసుకోవటం..అందలోంచి బెస్ట్ తీయటం లాంటి ఫిల్టరింగ్ ప్రాసెస్ ను ఫాలో అవుతున్నాం…ఈ సారి ఈ ఆప్షన్ చూసి ట్రే చేసి చూడండి.