సామాన్యుడికి షాక్…మళ్ళీ పెరిగిన పెట్రోల్ రేట్లు..!

పెట్రోల్ ,డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధరల పెరుగుదల విషయం లో కేంద్రం లో ఉన్న బీజేపీ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా…కేంద్రం గత ప్రభుత్వాలపైనే ఆరోపణలు చేస్తోంది. ఇక తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పెట్రోల్ పై 35 పైసలు… డీజిల్ పై 38 పైసలు పెరిగింది.

దాంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.109కు చేరింది. అదేవిధంగా డీజిల్ ధర రూ.102.04 కు చేరింది. వరంగల్ లో పెట్రోల్ ధర రూ 108.52 కు చేరగా…డీజిల్ ధర రూ.101.57 గా నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం లో పెట్రోల్ ధర రూ 109.50 గా…డీజిల్ ధర రూ.101.97 కు చేరింది. అదే విధంగా అనంతపురంలో పెట్రోల్ ధర రూ.111.37 గా ఉండగా డీజిల్ ధర రూ.103.76 గా ఉంది.