మీకు ఆయుష్మాన్ కార్డ్ లేదా? అయితే ఇలా ఈజీగా డౌన్లోడ్ చేస్కోండి!

-

పేద వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద కేంద్రం ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల దాకా వైద్యం కోసం ఆర్థిక సాయం అందిస్తుంది. దీన్ని దేశంలోని 50 కోట్ల మంది లబ్దిదారులను ఉద్దేశించి ప్రారంభించారు..ఇందుకు అర్హులైన లబ్దిదారులకు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా దీని కింద సెకండరీ, టెర్షియరీ ఆరోగ్య సదుపాయాలను కేంద్రం వారు అందజేస్తారు.

ఈ స్కీం కింద నిర్దేశిత జాబితాలోని ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దీని ద్వారా దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అయినా లబ్దిదారులు ఫ్రీగా నాణ్యమైన ఆరోగ్య సేవలు పొందవచ్చు.ఆయుష్మాన్ కార్డ్ ఉన్న రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా పలు రకాల వైద్య ప్రొసీజర్ల సేవలు, ఆపరేషన్‌ థియేటర్‌ ఖర్చులు లాంటివి కూడా అందుతాయి.

నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలు ఈ స్కీం కిందికి వస్తాయి.గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనివారు, కేవల వేతనం మాత్రమే తీసుకునేవారు ఇంకా ఇతర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు దీనికి అర్హులు. ఇక పట్టణ ప్రాంతాల్లో వారికి అయితే వారు చేసే వృత్తుల ఆధారంగా లబ్దిదారులను నిర్ణయిస్తారు.దీనికి అప్లై చేసుకోవాలంటే గుర్తింపు కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు/పాన్ కార్డు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, ఇంటి చిరునామా, కుల ధ్రవీకరణ పత్రం, ఆదాయ ధ్రవీకరణ వంటి పత్రాలు అవసరం అవుతాయి.

పీఎంజేఏవై అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆసుపత్రుల జాబితా తెలుసుకోవచ్చు. అందులో హాస్పిటల్ సెక్షన్‌లో మీ రాష్ట్రం, జిల్లాలపై క్లిక్ చేసి ఏ ఆస్పత్రిలో చేరాలనుకుంటున్నారో (ప్రభుత్వ, ప్రైవేట్-ఫర్-ప్రాఫిట్/ప్రైవేట్-అండ్ నాన్‌ ప్రాఫిట్) మీరు సెలెక్ట్ చేసుకోవాలి.మెడికల్ స్పెషాలిటీని ఎంపిక చేసుకోని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఆ తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి.

ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ముందుగా అధికారిక వెబ్‌సైట్ అయిన https://beneficiary.nha.gov.in/ లోకి వెళ్లాలి. తరువాత న్యూ రిజిస్ట్రేషన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. మీ పేరు, జెండర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డు వంటి సమాచారాన్ని నమోదు చేసి అడిగిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ అప్లికేషన్ ని అధికారులు సమీక్షస్తారు. ఇక ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయినాక ఆయూష్మాన్ కార్డును మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news