ఇండేన్ గ్యాస్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫర్‌.. డ‌బుల్ క‌నెక్ష‌న్‌తో ఎక్స్‌ట్రా రివార్డుల‌ను పొందే అవ‌కాశం..

-

ఇండేన్ గ్యాస్ కంపెనీ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పింది. ఆ సంస్థ అందించే 5కిలోల చిన్న సిలిండ‌ర్‌ను తీసుకునే వారికి ఎక్స్‌ట్రా రివార్డుల‌ను అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఇప్ప‌టికే పెద్ద సిలిండ‌ర్‌ను వాడుతున్న‌వారికి ఇది వ‌ర్తిస్తుంది. వారు 5కిలోల సిలిండ‌ర్‌ను కొత్త‌గా తీసుకోవ‌చ్చు. దీంతో ఒక‌టి పెద్ద సిలిండ‌ర్‌, రెండోది చిన్న సిలిండ‌ర్ ఉంటాయి. గ్యాస్ అయిపోయిన‌ప్పుడు చిన్న సిలిండ‌ర్ ప‌నిచేస్తుంది.

indane gas bumper offer to customers can get extra reward points

ఈ ఆఫ‌ర్ ను ఇండేన్ డ‌బుల్ బాటిల్ క‌నెక్ష‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీని గురించి ఆ కంపెనీ తాజాగా ట్వీట్ చేసింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే 14.2 కిలోల సిలిండ‌ర్ ఉన్న‌వారు 5కిలోల సిలిండ‌ర్‌ను బుక్ చేయ‌వ‌చ్చు. దీంతో రెండు సిలిండ‌ర్‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. పెద్ద సిలిండ‌ర్ అయిపోతే చిన్న సిలిండ‌ర్ బ్యాక‌ప్‌గా ప‌నిచేస్తుంది.

ఇక ఈ ఆఫ‌ర్‌ను అందుకున్న వారికి ఎక్స్‌ట్రా రివార్డులు ల‌భిస్తాయి. ఆ రివార్డు పాయింట్ల‌ను వారు ఎల్‌పీజీ రీఫిల్‌, పెట్రోల్‌, డీజిల్‌, స‌ర్వో లూబ్రికెంట్ల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. రెండు సిలిండ‌ర్ల‌లో దేన్ని తీసుకున్నా రివార్డు పాయింట్ల‌ను ఎక్కువ‌గా ఇస్తారు.

ఇక మ‌రిన్ని వివ‌రాల‌కు iocl.com అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news