స్ఫూర్తి: తల్లి పచ్చళ్ళని చూసి.. ఇప్పుడు 500 తల్లుల వంటకాలతో సంపాదన.. ఎలా సక్సెస్ అయ్యారంటే..?

-

కొంతమంది సక్సెస్ ని చూస్తే చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. జీవితంలో అనుకున్నది సాధించాలన్నా సక్సెస్ ని పొందాలన్నా అంత సులువు కాదు. మనం ఎంతో కృషి చేస్తే కానీ అనుకున్నది సాధించలేము. మామ్స్ కార్ట్ ద్వారా ఇప్పుడు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. చాలా మంది గృహిణిలు చాలా అద్భుతంగా వంట చేస్తూ ఉంటారు. కానీ కేవలం ఆ వంట రుచి నాలుక గోడలకు పరిమితం అవుతుంది.

కానీ నిజంగా అద్భుతంగా వంట చేసేవారు నలుగురికి పరిచయం అవ్వాలి. నలుగురు వాళ్ళ వంట రుచిని చూడాలి దాని ద్వారా చక్కగా సంపాదిస్తూ జీవితంలో పైకి రావాలి. మామ్స్ కార్ట్ ని 2018 లో మొదలుపెట్టారు ఇండోర్ బేస్డ్ ఇంజనీర్ అమన్ పోర్వాల్ దీనిని మొదలుపెట్టారు. మామ్స్ కార్ట్ ద్వారా చాలా మంది తల్లులు వారి యొక్క వంటకాలని నలుగురికి రీచ్ అయ్యేలాగా కష్టపడుతున్నారు పైగా మామ్స్ కార్ట్ ఇప్పుడు చాలా బాగా అభివృద్ధి చెందింది. అయితే 2020లో అందరూ ఉద్యోగుల కోసం వెతుకుతూ ఉంటే అమన్ మాత్రం సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అయితే తన తల్లిని చిన్నప్పటి నుండి అమన్ చూసేవారు.

చిన్నప్పటి నుండి తన తల్లి పచ్చళ్ళు, జామ్ మొదలైనవి తయారు చేస్తూ అమ్మేవారు. దీనితో మామ్స్ కార్ట్ బిజినెస్ ని మొదలు పెట్టాలని అనుకున్నారు. ఆన్లైన్ ద్వారా తన తల్లి రెసిపీలను అందరికీ పరిచయం చేయాలని అనుకున్నారు. హోం మేడ్ ప్రొడక్ట్స్ ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు. ఒకసారి ఎవరైనా తల్లులు ఈ ప్లాట్ ఫామ్ లో రిజిస్టర్ అయ్యాక ట్రైనింగ్ ఇవ్వడం క్వాలిటీని చెక్ చేయడం వంటివి చేస్తారు. భారతదేశంలో చాలా చోట్ల కేరళ చిప్స్, మినీ కచోరి, సోయా స్టిక్స్, మసాలాలు మొదలైనవి సప్లై చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం 500 తల్లుల వంటకాలతో నెలకి ఐదు లక్షలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news