లవ్ మేరేజ్ చేసుకుంటున్నారా.. రూ. 2.5 లక్షలు అందుకోండి..

-

ఈరోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం అయ్యాయి. వీటిలో చాలా వరకూ కులాంతర వివాహాలే ఉంటున్నాయి. ఇలా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి శుభవార్త. ఇంటర్ కాస్ట్ మేరేజ్ చేసుకున్న జంటలకు రెండున్నర లక్షల రూపాయల నజరానా ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.

ఇలా కులాంతర వివాహం చేసుకున్న వారికి గతంలోనూ ప్రోత్సాహకంగా నగదు ఇచ్చేవారు. అది కేవలం 50 రూపాయల రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా ఐదు రెట్లు పెంచిన రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఇందుకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ప్రేమ వివాహం కచ్చితంగా కులాంతర ప్రేమ వివాహమే అయి ఉండాలి. ఒకే కులంలో ప్రేమ వివాహం చేసుకున్న జంటలకు ఈ ప్రోత్సాహం లభించదు. అంతేకాదు.. వధూవరుల్లో ఎవరో ఒకరు ఎస్సీ అయి ఉండాలి. ఒకవేళ బీసీలు, ఇతర కులాల వారు ప్రేమ వివాహం చేసుకుంటే.. బీసీ కార్పోరేషన్ ప్రోత్సాహకం ఇస్తుంది.

కుల వ్యవస్థ మహమ్మారిని రూపుమాపడంతో పాటు ఎస్సీలను జనజీవనంలోకి తీసుకువచ్చేందుకు ప్రోత్సాహం పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరిగ్గా అర్థం చేసుకున్న జంటలు.. భవిష్యత్తుపై భరోసా కలిగేలా సెటిల్ అయిన జంటలు ప్రేమ వివాహాలు చేసుకుంటే పరవాలేదు కానీ.. జీవితంలో స్థిరపడకుండా ప్రేమ మైకంలో మునిగిపోతే.. ఆ ప్రేమ వివాహం మనుగడ కష్టమే అన్న సంగతి ప్రేమికులు గ్రహించాలి.

Read more RELATED
Recommended to you

Latest news