మరో సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్.. ఆ డైరెక్ట‌ర్‌కేనా..?

-

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్ ‘ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. అయితే విజయ్ దేవరకొండ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిన్ను కోరి, మజిలీ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణతో సినిమాకు ఓకె చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.

ఇక ఇప్పటికే ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో చేస్తున్న ‘హీరో’ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ‘ఫైటర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.అయితే ‘హీరో’ .. ‘ఫైటర్’ సినిమాలను పూర్తి చేసేలోగా, తను సిద్ధంగా వుండటం కోసం శివ నిర్వాణ చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నాడని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news