ట్రూకాలర్‌తో IRCTC ఒప్పందం…!

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ కాలర్ ఐడెంటిఫికేషన్ ప్లాట్‌ఫాం ట్రూకాలర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ-టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా వెరిఫైడ్ కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది.

IRCTC
IRCTC

ఇక పూర్తి వివరాలలోకి వెళితే.. 139 రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్ లైన్ నెంబర్‌ను ట్రూకాలర్ బిజినెస్ ఐడెంటిటీ సొల్యూషన్స్ ని ధ్రువీకరించింది. హెల్ప్ లైన్ నెంబర్ 139 కి కాల్ చేసే సమయం లో ట్రూకాలర్‌లో గ్రీన్ వెరిఫైడ్ బిజినెస్ లోగో కనపడుతుంది. ఇది ఇలా ఉంటే ఐఆర్‌సీటీసీ ధ్రువీకరించిన మెసేజ్‌ల ద్వారా మాత్రమే టికెట్ బుకింగ్స్, ప్రయాణ వివరాల సమాచారం తెలుస్తుందని అన్నారు.

వెరిఫైడ్ టిక్ మార్కు ద్వారా ట్రూకాలర్‌లో భారత రైల్వే లోగో ఫోటోతో పాటు ఉంటుంది. ఇలా మోసాల బారిన పడకుండా ఉండచ్చు. నమ్మకమైన, సురక్షితమైన సమాచారం అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ లో భారత రైల్వే మంచి స్థానం పొందింది. దేశం లో ప్రతి రోజూ 3 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తూ గమ్య స్థానాలని రైల్వేస్ చేరుస్తుంది. 18 జోన్ల లో 13 లక్షల మంది ఉద్యోగులు రైల్వే శాఖ లో సేవలని అందిస్తున్నారు.