Jan Aushadhi Diwas 2021: ఈ స్కీమ్ వలన కలిగే లాభాలు, ఈరోజు ప్రాముఖ్యత ఇలా ఎన్నో విషయాలు…!

-

మార్చి 7వ తేదీన దేశమంతటా కూడా ‘జన్ ఔషధీ దివస్’ లేదా ‘జనరిక్ మెడిసిన్ డే’ కింద జరుపుకుంటాము. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే…? ప్రజలకి జనరిక్ మెడిసిన్స్ పై అవగాహన కల్పించడమే, మొట్టమొదటిగా ‘జనరిక్ మెడిసిన్ డే’ ని 2019 వ సంవత్సరం లో జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది మూడవ సంవత్సరం.

ప్రధాని నరేంద్ర మోడీ జన్ ఔషధీ దివస్ వేడుక కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతున్నారు. మార్చి 7, 2021 పది గంటలకి వీడియో కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యారు. వచ్చిన సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ షిల్లాంగ్ లోని నార్త్ ఈస్ట్రన్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్ లో 7500 వ జన్ ఔషధీ కేంద్రాన్ని ప్రధాన మోడీ అంకితం చేయనున్నారు. ఈసారి మార్చి ఒకటి నుంచి మార్చి 7 వరకు జన్ ఔషధి వీక్ గా వివిధ థీమ్స్ తో చేశారు. ఇలా మార్చి 7న ‘Seva bhi, Rozgar bhi’ థీమ్ తో చేయనున్నారు.

జన్ ఔషధీ దివస్ గురించి కొన్ని విషయాలు:

ప్రధాని నరేంద్ర మోడీ ‘ప్రధానమంత్రి జన ఔషధీ పరియోజన స్కీం ను’ జులై 1 2015 జన ఔషధీ స్టోర్స్ అండర్ లో ప్రభుత్వం జనరిక్ మెడిసిన్స్ ని ప్రజలకి అందుబాటు లోకి తీసుకొచ్చింది దీంతో ప్రజలు ఖర్చు చేయగలిగే లాగ దీనిని తీసుకు వచ్చారు. హై క్వాలిటీ మెడిసిన్స్ ధరలు కూడా తగ్గించారు.

ఈ స్కీం వల్ల కలిగే లాభాలు:

ఈ స్కీం ద్వారా జనరిక్ మెడిసిన్స్ 7400 స్టోర్స్ తో ప్రజలకి సులువుగా అందుబాటులోకి వచ్చాయి మన దేశంలో అనేక జిల్లాల్లో వీటిని సులువుగా పొందొచ్చు. మార్కెట్ ధరల తో పోలిస్తే వీటి ధరలు కూడా తక్కువ. దీనికి సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ ని కూడా చేయడం జరిగింది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన సెంటర్స్ మరియు డాక్టర్లు, ఎక్స్పర్ట్స్ ఇలా అనేక ఆర్గనైజేషన్స్ లో కూడా ప్రోగ్రాంస్ ని నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news