ఈ రోజుల్లో పిల్లల నోట్లో నోరు పెట్టడమే పాప౦ అయిపోయింది. అంతా వాళ్ళ పెత్తనమే. వాళ్ళను ఏదైనా ప్రశ్న వేసినా సరే మనకు మనం ఎన్నో ప్రశ్నలు వేసుకునే పరిస్థితి తెచ్చేసారు. వాళ్లకు కోపం వస్తే చాలా మంది తల్లి తండ్రులు, సరేలే అని లైట్ తీసుకుని కాసేపటికి వాళ్ళే సెట్ అయిపోతారు అనే భ్రమలో ఉంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదని పరిశోధకులు, వైద్యులు, మానసిక నిపుణులు అంటున్నారు.
చాలా నష్టాలు ఉన్నాయని అంటున్నారు. అవి ఏంటో ఒకసారి చూడండి. పిల్లలు కోపం వచ్చినప్పుడు ఎక్కువగా వినాశనకార ఆలోచనలు చేస్తారు అంట. అంటే వాళ్ళను మీరు అదుపు చేస్తున్నారు అనే భ్రమలో ఉండి నాశనం దిశగా ఆలోచించడ౦. తల్లి తండ్రులకు వ్యక్తిగతంగా నష్టం చేయడం, దొంగతనాలు చేయడం, ఇంట్లో వస్తువులు నాశన౦ చేయడం, మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లో ఉన్న సమాచారాన్ని దొంగాలించడం.
ఇంట్లో వస్తువులను పారేయడం, వాటిని అమ్ముకోవడ౦, అంతే కాదు తమ కోపాన్ని చదువు మీద, స్కూల్ లో కూడా చూపిస్తున్నారు. స్కూల్ లో మీ పరువు తీయడంతో పాటు గా అక్కడి టీచర్ల మీద కోపం చూపించడం వంటి చర్యలకు పిల్లలు దిగుతున్నారు. అందుకే పిల్లలతో ఎంత వరకు సామరస్యంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. వాళ్ళతో అనవసర రాద్దాంత౦ లేకుండా చూడమని చెప్తున్నారు. ఇంకో విషయం అండోయ్ పిల్లలకు చెడు ఉంటే చెవిలో చెప్పండి మంచి ఉంటే మందిలో చెప్పండి. ఓకే నా జాగ్రత్త.