పెన్షన్‌ విధానంలో మార్పులు.. ఫ్యామిలీ లిమిట్‌ ఎంతంటే?

-

ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఫ్యామిలీ పెన్షన్‌ లిమిట్‌ భారీగా పెరిగింది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై, íసీసీఎస్‌ 1972 పరిధిలో ఉంటే.. వారి మరణానంతరం వారసులు రెండు పెన్షన్లను పొందే అవకాశం కల్పించింది.వారు గరిష్టంగా ప్రతి నెలా రూ. 1.25 లక్షల వరకు పొందవచ్చు. సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (పెన్షన్‌) రూల్స్‌ 1972 లోని రూల్‌ 54, సబ్‌–రూల్‌ (11) ప్రకారం మరణించిన ఉద్యోగుల పిల్లలు లేదా తల్లిదండ్రులు రెండు పెన్షన్లను పొందేందుకు అర్హత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తల్లిదండ్రుల్లో ఒకరు సర్వీసులో ఉన్నప్పుడు లేదా రిటైర్‌మెంట్‌ తరువాత మరణిస్తే, వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్ష¯Œ ను.. బతికున్న భర్త లేదా భార్యకు చెల్లిస్తారు.

 

  • రూల్‌ 54లోని సబ్‌ రూల్‌ (3)లో పేర్కొన్న దాని ప్రకారం, వారసులు తమ తల్లిదండ్రులకు సంబంధించిన రెండు ఫ్యామిలీ పెన్షన్లను డ్రా చేసుకునే అర్హత ఉంటే వారు నెలకు రూ .45,000 పెన్షన్‌ వరకు మాత్రమే పెన్షన్‌ పొందే వీలుంది.
  • రూల్‌ 54లోని సబ్‌రూల్‌ (3) ప్రకారం, ఒకే పెన్షన్‌ పొందుతున్న వారసులకు కూడా గరిష్టంగా నెలకు రూ .45, 000 మించి చెల్లించరు.
  • రూల్‌ 54లోని సబ్‌ రూల్‌ (2) ప్రకారం రెండు కుటుంబ పెన్షన్‌కు అర్హత ఉన్న వారసులు ఒక్కో పెన్షన్‌ నుంచి రూ .27,000 మాత్రమే పొందే వీలుంది.
  • సీసీఎస్‌ నిబంధనల్లోని రూల్‌ 54 (11) ప్రకారం, రూ .45,000, రూ .27,000 పెన్షన్ల పరిమితిని ఆరవ వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయించారు.
  • ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల అత్యధిక వేతనాన్ని రూ. 2,50,000గా నిర్ణయించారు. అందువల్ల, రెండు పెన్షన్‌ పరిమితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news