తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం

-

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ఘనంగా జరగాల్సిన వేడుకలు కరోనా ఎఫెక్ట్‌తో నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఊరు, వాడ, పల్లె, గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాల్సిన తెలంగాణ ప్రజలు నిబంధనలతో చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేడుకలను అలా అలా జరుపుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జిల్లా కలెక్టరేట్లలో జెండాలు ఎగురవేయాలని సూచించింది.

అటు తెలంగాణ శాసనమండలిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసన మండలి ప్రాంగణంలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహా చార్యులు, టీఆర్ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి, అసెంబ్లీ, మండలి ఉద్యోగులు పాల్గొన్నారు.

మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా పార్టీ ఆఫీసుల్లో జాతీయ జెండాలు ఎగురవేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news