ఒక్క డయల్ తో మీ ఫోన్ రేడియేషన్ తెలుసుకోండి..? వాడాలో.. పారేయాలో డిసైడ్ చేసుకోండి..!

ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వాళ్లు చాలా అరుదు. కానీ ఈ మొబైల్ ఫోన్ల కారణంగా విపరీతమైన రేడియేషన్ కు వినియోగదారులు గురవుతున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఫోన్ పని చేయాలంటే రేడియేషన్ అవసరం. అది లేకుండా మొబైల్ పని చేయదు.

కానీ ఈ రేడియేషన్ ఒక స్థాయికి మించితే ఆరోగ్యానికి చాలా డేంజర్. అధిక రేడియేషన్ మనిషి మెదడుపై , చెవి కింది భాగంగా పై విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. అనేక రకమైన రోగాలకు కారణం అవుతుంది. అయితే మరి మన ఫోన్ రేడియేషన్ ఎంతో ఎలా తెలుసుకోవాలి.

ఇందుకు చాలా సింపుల్ చిట్కా ఉంది. మీరు ఉపయోగించే సెల్ ఫోన్ నుంచే మీరు ఈ విషయం తెలుసుకోవచ్చు. ఫోన్లో ‘రేడియేషన్ లెవల్ తెలుసుకోవడానికి *#07# కు డయల్ చేస్తే చాలు.. వెంటనే మీ సెల్ ఫోన్ రేడియేషన్ ఎంతో మొబైల్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంది.

అలా వచ్చే రేడియేషన్ స్థాయి.. 1.6w/kg కంటే తక్కువ స్థాయిలో ఉంటే ఓకే.. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు అర్జంట్ గా ఫోన్ మార్చడం బెటర్. ఎందుకంటే మొబైల్ ఫోన్ కోసం మన ఆరోగ్యాన్ని బలిపెట్టలేం కదా.