న్యూ జీవన్ శాంతి పాలసీతో ప్రతీ నెలా డబ్బులు పొందొచ్చు..!

మీరు  ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? ప్రతీ నెలా అదిరే లాభం పొందాలని అనుకుంటున్నారా..? అయితే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC అందిస్తున్నన్యూ జీవన్ శాంతి పాలసీని బెస్ట్. ఇక ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

LIC అందిస్తున్నన్యూ జీవన్ శాంతి పాలసీని తీసుకుంటే చక్కటి లాభాలని పొందొచ్చు. ప్రతీ ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులొస్తాయి. పాలసీలో కనీస ప్రీమియం రూ.1,50,000 చెల్లించాలి. గరిష్ట ప్రీమియం పరిమితి లేదు.

ఇది ఇలా ఉంటే ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 30 ఏళ్లు. గరిష్ట వయస్సు 79 ఏళ్లు. పాలసీలో రూ.1,50,000 సింగిల్ ప్రీమియం చెల్లించిన వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 కనీస యాన్యుటీ లభిస్తుంది. డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్, డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఆప్షన్స్ ఉంటాయి.

డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్ ఎంచుకుంటే యాన్యుటీ అంటే ప్రతీ ఏటా డబ్బులు జీవితాంతం లభిస్తాయి మరణించిన తర్వాత పాలసీ డబ్బులు నామినీకి వస్తాయి. పాలసీ తీసుకున్నప్పుడు వడ్డీ రేట్లు ఎలా వుంటాయో అవే వడ్డీ రేట్లు వస్తూ ఉంటాయి.

45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10,00,000 సింగిల్ ప్రీమియం చెల్లించి ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీ తీసుకుంటే.. డిఫర్‌మెంట్ పీరియడ్ 12 ఏళ్లు ఎంచుకుంటే…

సెకండరీ యాన్యుటెంట్ వయస్సు 35 ఏళ్లు. ఏడాదికి రూ.99,400, ఆరు నెలలకు రూ.48,706, మూడు నెలలకు రూ.24,105, నెలకు రూ.7,952 డబ్బులు వస్తాయి.

అదే ఒకవేళ డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్ ఎంచుకుంటే ఏడాదికి రూ.94,100, ఆరు నెలలకు రూ.46,109, మూడు నెలలకు రూ.22,819, నెలకు రూ.7,528 వస్తాయి.