ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో వున్నాయి. ఈ స్కీమ్స్ తో డబ్బులని దాచి ఎక్కువ మొత్తాన్ని భవిష్యత్తులో ఒకేసారి పొందొచ్చు. చాల మంది ఎక్కువ రిటర్న్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే వీటి వలన పెట్టుబడితో పాటు బీమా కూడా వస్తుంది.అయితే LIC SIIP ప్లాన్ అందిస్తోంది. దీని వలన మంచి లాభాలు పొందొచ్చు. ఇది నాన్ పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, ఇండివిజ్యువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. దీనిని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ లో చెల్లించే ప్రీమియం ఈక్విటీ, మనీ మార్కెట్, బాండ్ మార్కెట్‌లోకి వెళ్తుంది. ఇది ఇలా ఉంటే దీనిలో మొత్తం నాలుగు రకాల ఫండ్స్ వున్నాయి.
వీటిలో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. బాండ్ ఫండ్ ఎంచుకుంటే 60 శాతం గవర్నమెంట్ బాండ్స్‌లో, 40 శాతం మనీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సెక్యూర్డ్ ఫండ్ ఎంచుకుంటే 45 శాతం గవర్నమెంట్ బాండ్స్‌లో, 40 శాతం మనీ మార్కెట్‌లో, 15 శాతం ఈక్విటీ మార్కెట్‌లో, బ్యాలెన్స్‌డ్ ఫండ్ ఎంచుకుంటే 30 శాతం గవర్నమెంట్ బాండ్స్‌లో, 40 శాతం మనీ మార్కెట్‌లో, 30 శాతం ఈక్విటీ మార్కెట్‌లో, గ్రోత్ ఫండ్ ఎంచుకుంటే 20 శాతం గవర్నమెంట్ బాండ్స్‌లో, 40 శాతం మనీ మార్కెట్‌లో, 40 శాతం ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.
పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 25 ఏళ్లు ఉంటుంది. నెలకు కనీసం రూ.4,000 లేదా ఏడాదికి రూ.40,000 చొప్పున పొదుపు చేయొచ్చు. 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 25 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే…. నెలకు రూ.10,000 ప్రీమియం సెలెక్ట్ చేస్తే.. అప్పుడు ఏడాదికి రూ.1,20,000 ప్రీమియం చెల్లించాలి.
వార్షిక ప్రీమియంకు 10 రెట్లు కవరేజీ ఉంటుంది. అంటే రూ.12,00,000 సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. బాండ్ ఫండ్ ఎంచుకుంటే రిటర్న్స్ కనీసం 4 శాతం నుంచి 8 శాతం మధ్య ఉంటాయి. 4 శాతం రిటర్న్స్ లెక్క ప్రకారం మెచ్యూరిటీ సమయంలో రూ.40,04,293 + గ్యారెంటీడ్ అడిషన్స్ పొందొచ్చు..
8 శాతం చొప్పున చూస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.69,17,669 + గ్యారెంటీడ్ అడిషన్స్ లభిస్తాయి. అంటే సుమారు రూ.70,00,000 వరకు రిటర్న్స్ పొందొచ్చు.