ఈ LIC పాలసీతో ప్రతీ నెలా ఎనిమిది వేలు పొందండి…!

-

మీరు ఏదైనా LIC పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ పాలసీ గురించి తప్పక తెలుసుకోవాలి. మీరు కనుక ఇప్పుడు ఒకేసారి డబ్బులు ఈ పాలసీకి కడితే.. మీకు ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇక మరి ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలని చూద్దాం.

వివరాల లోకి వెళ్ళిపోతే… దేశీ అతిపెద్ద బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. వీటిని తీసుకోవడం వల్ల పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ పాలసీ తీసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. మీకు ప్రతి నెలా రూ.8 వేలకు పైగా పొందొచ్చు.

ఎల్ఐసీ అందిస్తున్న ఈ జీవన్ శాంతి ప్లాన్ తీసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. మీకు 30 ఏళ్లు వుంది… మీరు 20 ఏళ్ల తర్వాతి నుంచి పెన్షన్ పొందాలని అనుకుంటే… మీకు 50 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి నెల పెన్షన్ వస్తుంది. మీరు రూ.5 లక్షల మొత్తానికి గానూ పాలసీ తీసుకున్నట్లయితే ప్రతి నెలా రూ.8,500 వరకు పెన్షన్ వస్తుంది.

ఇక్కడ రూ.5 లక్షలు ఒకేసారి చెల్లించాలి. ఇలా మీరు ప్రతి నెలా కూడా రూ.8,500 వరకు పెన్షన్ పొందొచ్చు. వెంటనే అయినా తీసుకోవచ్చు లేదా కొంత కాలం తర్వాతి నుంచి అయినా కూడా మీరు తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో ఈ పాలసీ కొనుగోలు చేయొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news