మీ ఆధార్ ను IRCTC‌తో లింక్ చేసి.. ఈ ప్రయోజనాలని పొందండి..!

-

ఇండియన్ రైల్వేస్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్‌సీటీసీ గురించి తెలియని వారు ఉండరు. అయితే మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా..? అయితే మీకు ఒక శుభవార్త… ఐఆర్‌సీటీసీ అకౌంట్ కలిగిన వారు సులభంగానే ఆన్‌లైన్ ‌లో ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ తో పాటు ఫోన్ లో యాప్ కూడా అందుబాటులో ఉంది. రైలు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న తరువాత వారికి వారి టికెట్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు గాను అలాగే మెయిల్ ఐడి కి గాని వస్తాయి .అయితే ఇలా కేవలం ఒక అకౌంట్లో ఒక నెలలో గరిష్టంగా ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు. అంతకుమించి బుక్ చేసుకునే వెసులుబాటు లేదు. కానీ ఇప్పుడు ఈ సంఖ్యను 6 నుంచి 12 వరకు పెంచుకునే అవకాశం కూడా కలదు.

irctc-aadhar
irctc-aadhar

ఇందుకోసం మీరు చేయాలిసిందల్లా మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ తో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్‌ను లింక్ చేసుకోవడమే. అయితే దీని కోసం మీరు ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ కు వెళ్లాలి. అక్కడ మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ఆధార్ కేవైసీపై క్లిక్ చేయాలి.ఈ ఆప్షన్ అనేది మై ప్రొఫైల్ ట్యాబ్‌ లో ఉంటుంది. ఆధార్ కేవైసీ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అనేది ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. వెరిఫై చేసి సబ్‌మిట్ చేయాలి. ఇప్పుడు ఆధార్‌ తో అకౌంట్ అనేది అనుసంధానమౌతుంది. తర్వాత ప్రొఫైల్ సెక్షన్‌లో మాస్టర్ లిస్ట్‌లోకి వెళ్లి, అక్కడ ప్యాసింజర్ పేరు ఎంటర్ చేయాలి. తరువాత మీ యొక్క ఆధార్ నెంబర్, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి.

వెరిఫికేషన్ అయిన తర్వాత వెరిఫైడ్ అని వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడయినా గాని ఆరుగురి కన్నా ఎక్కువ మందికి టికెట్ బుక్ చేసేటప్పుడు కచ్చితంగా ఒక ప్రయాణికుడి యొక్క ఆధార్ అయిన వెరిఫై అయ్యి ఉండాలి. అప్పుడే టికెట్స్ బుక్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news