మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా.. అర్జెంట్‌గా ఇది చదవండి..!

-

Link your account with mobile number by this month end says sbi

మీరు ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా? మీకు ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు నవంబర్ 30 వ తేదీలోగా మీ ఖాతాకు మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవాలి. లేదంటే మీరు మీ అకౌంట్‌కు సంబంధించి ఆన్‌లైన్ లావాదేవీలను చేసుకోలేరు. వాటిని బ్యాంక్ నిలిపివేయనుంది. ఈ విషయాన్ని బ్యాంకే స్పష్టం చేసింది. ఈ ప్రకటనను తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అంటే మీరు మీ మొబైల్ నెంబర్‌ను అకౌంట్‌కు ఈనెల 30 లోగా అనుసంధానం చేసుకోకపోతే డిసెంబర్ 1, 2018 నుంచి ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోలేరు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి వరకు మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోని వాళ్లు సంబంధిత బ్యాంక్ శాఖలో కానీ.. లేదా ఏటీఏంలో గానీ లింక్ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news