మీరు డ్రైవింగ్ చేస్తారా…? అయితే ఈ జాగ్రత్తలు ముఖ్యం..!

Join Our Community
follow manalokam on social media

మీరు కారుని డ్రైవ్ చేస్తారా అయితే తప్పకుండా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు మేము కొన్ని డ్రైవింగ్ టిప్స్ ని చెప్తున్నాము. దీంతో మీరు మీ కార్ ని సేఫ్ గా నడపడానికి కూడా వీలు అవుతుంది. కొన్ని టెక్నిక్స్ ఇక్కడ వున్నాయి. మీరు వీటి ద్వారా నేర్చుకోవచ్చు. ఆ ట్రిక్స్ ఉన్నాయి కోసం ఒక లుక్ వేయండి.

టర్నింగ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వుండండి:

మీరు వేగంగా మీ కారు నడుపుతున్న సమయం లో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. మామూలుగా నడిపినప్పుడు కూడా ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు మీ కార్ ని స్పీడ్ గా నడుపుతూ వస్తున్నారో అప్పుడు స్లో గా వచ్చి టర్న్ తిప్పడం ముఖ్యం. అంతే కానీ వేగంగా దూసుకెళ్లి టర్న్ తిప్పారంటే చాల ప్రమాదం. కాబట్టి దీనిని గుర్తుంచుకోండి. అలానే మంచిగా టర్న్ తీసుకోవడం రావాలి. అలా చేస్తే నిజంగా మంచి డ్రైవర్ అవ్వగలరు.

అద్దాలని మీకు వీలుగా మార్చుకోండి:

డ్రైవింగ్ చేసేటప్పుడు అద్దాల పై దృష్టి చాలా అవసరం. మీ డ్రైవింగ్ కి తగ్గట్టు మీరు మొదట అద్దాలని అమర్చుకోండి. దీనిని బట్టి మీరు స్పీడ్ ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలానే రెండు వైపులా అద్దాలను ఉపయోగించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి చాలా అవసరం.

చక్రాలపై శ్రద్ధ తీసుకోండి:

దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న గోతులు వంటి వాటిపై దృష్టి పెట్టి నడపాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ గోతులని చూసుకుని నడపడం ముఖ్యం.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...