మహమ్మారి సమయంలో మనీ పాఠాలు.. తెలుసుకుంటే మంచిదే

-

మహమ్మారి కారణంగా ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చాయి. ప్రతీ ఒక్కరి వద్ద డబ్బుల కొరత ఏర్పడింది. అప్పు అన్న పదం అందరి నోట్లో నుండి వినబడుతుంది. లాక్డౌన్ కారణంగా చిన్న చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. దాంతో చాలామంది ఉపాధి లేక వీధిన పడ్డారు. సంవత్సరంన్నర కాలంగా కరోనా మూలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఇలాంటి కష్టకాలంలో డబ్బు పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. మహమ్మారి సమయంలో తెలుసుకోవాల్సిన మనీ పాఠాలేంటో చూద్దాం.

 

money

సంపాదిస్తున్న దానికన్నా తక్కువ ఖర్చు చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏ సమస్య ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావట్లేదు.

ఆన్ లైన్ షాపింగ్ అని అనవసరమైనవన్నీ ఇంట్లోకి తెచ్చుకోవద్దు. ఒక్కోసారి చాలా చిన్న చిన్న వస్తువులే పెద్ద పెద్ద భారాలుగా మారతాయి. అందుకే నిజంగా అవసరం ఉంటే తప్ప ఆన్ లైన్ లో షాపింగ్ చేయవద్దు. అక్కడ ప్రతీదీ ఆకర్షణీయంగా కనిపించి మీ జేబుకు చిల్లు పెడుతుంది.

మీరు చేసే రెగ్యులర్ జాబ్ లో స్తంభన ఏర్పడితే ఏదైనా కొత్త కళ నేర్చుకోండి. దానివల్ల మీకు ఆదాయం వచ్చేలా చేసుకోండి.

ఎక్కడ షాపింగ్ చేసినా, వారెంటీ, గ్యారెంటి కార్డులను జాగ్రత్తగా భద్రపర్చండి. మహమ్మారి సమయంలో అలాంటివి చాలా అవసరం. ప్రతీ దానికి జేబులో నుండి డబ్బులు తీయాలంటే కష్టంగా మారవచ్చు.

అయిన దానికీ, కాని దానికీ క్రెడిట్ కార్డు వాడవద్దు. వాడేముందు ఇప్పుడు అవసరమా అన్న ఆలోచన చేయండి. క్రెడిట్ కార్డు గీకడాలు పెరిగిపోతుంటే దాన్ని కట్టేటపుడు మీ గుండే వేగం పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి.

ఆడంబరాలకు పోయి అప్పు చేసి మరీ పెద్ద ఎత్తులో ఫంక్షన్లను ప్లాన్ చేసుకోవద్దు. దీనికోసం ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చి చూసుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news